విశాఖ రైల్వే జోన్.. బాబు లేఖల రాజకీయం

Update: 2019-02-27 11:20 GMT
బాబు మళ్లీ లేఖల రాజకీయం మొదలు పెట్టారు. ఆది నుంచి ఆదే ప్లాన్ తో బాబు ముందుకెళ్తుంటారు. వర్కవుట్ అయ్యే ముందు లేఖలు రాస్తూ ఆ ఘనతను తన ఖాతాలో వేసుకునే బాబు.. ఇప్పుడు కూడా అదే డ్రామాలకు తెరతీశారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు..

మార్చి 1న ప్రధాని మోడీ ఏపీలోని విశాఖలో పర్యటించబోతున్నారు. ఇదే సమయంలో విశాఖకు రైల్వేజోన్ ను ప్రకటిస్తారన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు ఇదే విషయాన్ని చూచాయగా వెల్లడించారు. ఇప్పుడు జోన్ ప్రకటిస్తే ఆ క్రెడిట్ మొత్తం ప్రధాని నరేంద్రమోడీ ఖాతాలో పడుతుంది. అందుకే దాన్ని హైజాక్ చేయాలని బాబు భావిస్తున్నాడు.

ఏపీ సీఎం చంద్రబాబు ఆగమేఘాల మీద విశాఖకు రైల్వే జోన్ ఇచ్చి తీరాలంటూ కేంద్రానికి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ విశాఖకు రైల్వే జోన్ ప్రకటించేందుకు సిద్ధమైన వేళ.. బాబు లేఖ రాసి ఆ మొత్తం క్రెడిట్ తన లేఖ వల్లేనని చెప్పుకోవడానికి ఈ ఎత్తు వేసినట్లు స్పష్టమవుతోంది.

తెలంగాణ విభజన సమయంలోనూ బాబుగారు ఇదే ప్లాన్ చేశారు.  తాను తెలంగాణకు అనుకూలంగా లేఖ రాయడం వల్లనే ఆ రాష్ట్రం వచ్చిందని గొప్పలకు పోయారు. ఇప్పుడూ అదే స్ట్రాటజీతో విశాఖ రైల్వే జోన్ కు కేంద్రం సై అన్న వేళ లేఖల రాజకీయం చేశారు.

అయితే బాబు మనసులో మాత్రం విశాఖకు రైల్వే జోన్ కంటే తమ కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉంటున్న అమరావతిలోనే రైల్వే జోన్ వస్తే బాగుంటుందని యోచిస్తున్నారట. కానీ బయటకు చెబితే విశాఖ వాసుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి పైకి మాత్రమే విశాఖ జోన్ అంటున్నాడని ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
    

Tags:    

Similar News