టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ నుంచి గవర్నర్, ప్రభుత్వ ప్రధాన ముఖ్యకార్యదర్శికి అనేక అంశాలపై లేఖలు రాశారు. తాజాగా ఆయన మరో లేఖ రాశారు. అయితే.. ఈసారి చంద్రబాబు.. తన లేఖను డీజీపీ గౌతం సవాంగ్‌కు రాయడం గమనార్హం. ఈ లేఖలో చంద్రబాబు తన కలానికి ఒకింత ఆవేశాన్ని జోడించారు. ఈ లేఖలో ఏం రాశారంటే..
నెల్లూరు జిల్లా పైడేరు కాల్వలో కొందరు వైసీపీ నేతలు చేస్తున్న మట్టి మాఫియాను ప్రశ్నించినందుకు కొడవలూరు మండలం కమ్మపలేం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కరాకట మల్లికార్జున్పై నలుగురు వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కొడవలూరు పోలీసులు మల్లికార్జున్పైనే తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయటంతో పాటు అతనిపైనే రౌడీషీట్ తెరిచారని తప్పుబడుతూ లేఖలో నిప్పులు చెరిగారు. ఒక ఎస్సీ యువకుడిని వేధించేందుకు పోలీసులు అధికార పార్టీ నాయకులతో చేతులు కలిపి ఇలా చేయటం దుర్మార్గమని దుయ్యబట్టారు.
పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ లేనివిధంగా పోలీసు చర్యలు ఉన్నాయని ఆరోపించారు. అసలు నేరస్థులపై వెంటనే చర్యలు తీసుకుని మల్లికార్జున్‌పై దాఖలైన తప్పుడు కేసులను తొలగించాలని డిమాండ్ చేశారు. మల్లికార్జున్‌ను తప్పుడు కేసులో ఇరికించడానికి ప్రయత్నించిన కొడవలూరు పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. మల్లిఖార్జున్పై దాడికి సంబంధించిన ఓ వీడియోను చంద్రబాబు లేఖకు జత చేశారు. అదేసమయంలో గతంలో పోలీసులు వ్యవహరించిన తీరును కూడా ఎండగట్టారు. ప్రస్తుతం తాము అధికారంలో లేమని భావిస్తున్నారా? లేక.. అధికారంలో ఉన్నవారే శాశ్వతం అనుకుంటున్నారా? అంటూ.. నిలదీశారు. అధికారంలోకి వచ్చాక.. ఎవరెవరు ఏం చేశారో.. గుర్తు చేసి మరీ చర్యలు తీసుకోవడం తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించడం గమనార్హం.