కళ్యాణ లక్ష్మి - కీలక మార్పు !

Update: 2019-06-27 11:30 GMT
ప్రతిపక్షాల పట్ల కఠినంగా ఉండే కేసీఆర్ పేదల పట్ల మాత్రం చాలా ప్రేమపూర్వకంగా ఉంటారు. ఆయన అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన సంచలన పథకాల్లో ఒకటైన ’కళ్యాణ లక్ష్మి‘ ని తాజాగా మరింత విస్తరించారు. ప్రస్తుతం ఇది మొదటి పెళ్లి చేసుకునే వారికే వర్తిస్తుంది. అయితే, ఈ పథకంలో మార్పులు చేస్తూ రెండో పెళ్లికి కూడా కల్యాణ లక్ష్మి సాయం వర్తించేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో నివసించే నిరుపేద దళిత- గిరిజన- బీసీ- ఓబీసీ- మైనార్టీ కులాలకు చెందిన యువతులకు ఇది అప్పులపాలు కాకుండా అండగా నిలుస్తోంది. సామాన్యులకు లక్ష రూపాయలు అంటే... పెళ్లి ఖర్చుతో సమానం.

తెలంగాణలో ప్రవేశపెట్టాక చంద్రబాబు కూడా దీనిని అనుసరించారు. పేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లి భారంగా మారకూడదని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే పథకాన్ని ముస్లింలకు షాదీ ముబారక్ పేరిట అందిస్తున్నారు. 2014, అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ పథకం అమలులోకి వచ్చింది.

కళ్యాణ లక్ష్మి- రైతు బంధు పథకాలతో పాటు తెలంగాణ అనేక సంక్షేమ పథకాలతో కేసీఆర్ మనసు దోచుకున్నారు. ఇటీవల మొదలుపెట్టిన గురుకుల పాఠశాలలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. గ్రామీణ వృద్ధులకు అత్యంత సాధారణంగా వచ్చే కంటి జబ్బులకు కూడా కేసీఆర్ ప్రత్యేక పథకం రూపొందించిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News