సినిమా టైపులో కిడ్నాప్ నకు ప్లాన్ చేసిన ఓ భాగోతం.. ఓ ఛానల్ ప్రతినిధులతో పాటు సీఈఓ అరెస్టుకు కూడా దారి తీసింది. ఆ సీఈఓ పేరు శివకుమార్. జీతాలు ఇవ్వమని అడిగితే.. మీరే సంపాదించుకోండి.. అందులోంచి నెలకో పాతికవేలు నాకు కూడా ఇమ్మని స్వయంగా ఛానల్ ఓనర్ చెప్పడంతో.. ఇక ఆ ఛానల్ ప్రతినిధులు రెచ్చిపోయారు. గత నెల 31న హైద్రాబాద్ కృష్ణానగర్ లో ఉంటున్న కాలెపు శ్రీనివాసరావు అనే నటుడి ఇంటిపై దాడికి వచ్చి సినిమా చూపించేశారు.
సీఐడీ డిపార్ట్ మెంట్ లో పని చేసే హోంగార్డు రాజు.. ఎస్ఐ పాత్రను పోషించగా.. ఛానల్ లో డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తి కానిస్టేబుల్ అవతారం ఎత్తాడు. ఇద్దరు వ్యభిచారిణిల్లో ఒకరు మహిళా రిపోర్టర్ గా యాక్ట్ చేసి.. అంతా కలిసి శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి బెదిరించారు. వ్యభిచార గృహం నడుపుతున్నావంటూ బెదిరి బీరువాలో ఉన్న డబ్బును దొంగిలించారు. ఆ తర్వాత ఏటీఎంకు తీసుకెళ్లి మరింతగా క్యాష్ డ్రా చేయించారు. ఇక్కడితో ఆగకుండా మరో 2 లక్షలు ఇస్తే.. టీవీ ఛానల్ లో న్యూస్ వేయబోమని బెదిరించి వెళ్లారు.
తనను కిడ్నాప్ చేసి మరీ బెదిరింపులకు పాల్పడ్డారంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడంతో.. వారి దర్యాప్తు చేసి మొత్తం కూపీ లాగారు. చివరకు ఛానల్ సీఈఓ సహా మొత్తం 11 మందిని అరెస్ట చేశారు పోలీసులు. మీ జీతాలు మీరే సంపాదించుకోమని.. నాక్కూడా వాటా ఇవ్వమని తమ ఛానల్ ఓనర్ చెప్పడంతోనే ఇలా చేశామంటున్నారు ఆ నిందితులు.