తెలుగు రాష్ట్రాల రాజకీయాలని శాసించగల వ్యక్తి - ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం..ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కుటుంబానికి సంబంధించిన సంచలన పరిణామం చోటుచేసుకుంది. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రామోజీరావు కోడలు శైలజా కిరణ్ పై హైదరాబాద్ లో కేసు నమోదైంది. ఫండ్ గ్యారెంటరైనా సంగీత సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇల్లీగల్ గా అటాచ్ మెంట్ చేశారని నాంపల్లి కోర్టు లో సంగీత అనే వ్యక్తి ప్రైవేటు కేసు వేశారు.
ఈ పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం శైలజా కిరణ్ మీద వెంటనే కేసు నమోదు చేయాలని నాంపల్లి పోలీసులను ఆదేశించింది. దీంతో శైలజా కిరణ్ పై నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. ఆమెతో పాటుగా మార్గదర్శి తిరుమలగిరి బ్రాంచ్ మేనేజర్ పార్ధసారధి - ఉద్యోగులు సంపత్ - చిట్ ఫండ్ కంపెనీపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 420 - 468 - 471 - రెడ్ విత్ 34 సెక్షన్ల కింద వీరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు త్వరలోనే అన్ని వివరాలు తెలుపుతామని నాంపల్లి పోలీసులు తెలిపారు.