సోము వీర్రాజు అల్లుడి పై చీటింగ్ కేసు.. సంబంధం లేదన్న ఆయన కూతురు?

Update: 2022-01-04 07:34 GMT
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడిపై చీటింగ్ కేసు నమోదైంది. ఆస్తి పత్రాలపై ఫోర్జరీ సంతకాలు చేసి బ్యాంకు లోను తీసుకున్నారని ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయంలో సోము వీర్రాజుకు కూడా సంబంధాలున్నాయా..? అనే కథనాలు వెలువడ్డాయి. వెంటనే వీర్రాజు కూతురు స్పందించింది. ఈ కేసుతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని తెలిసింది. ఇది మా పర్సనల్ విషయమని, ఇందులో మా నాన్న పేరు తీయొద్దని కోరారు. అయతే ఇదంతా రాజకీయ కుట్ర అని ఆరోపించారు.

రాజమండ్రికి చెందిన గద్దె జయరామకృష్ణ కొవ్వూరు పోలీస్ స్టేషన్లో సోము వీర్రాజు అల్లుడు వెంకట నరసిహంపై గత నెల 4న  ఫిర్యాదు చేశారు. తమ ఆస్తి పత్రాలపై ఫోర్జరీ సంతకాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఫిర్యాదు చేసిన కొన్ని రోజులకు ఆయనపై 406,419, 420, 465 సెక్షన్ల కింద కేసుల నమోదు చేశారు. సుమారు రూ.15 కోట్ల రూపాయల వరకు ఇందులో ఫ్రాడ్ కు పాల్పడ్డట్లు పోలీసులు తెలుపుతున్నారు. 2018 -2019 మధ్య కాలంలో కొందరు బ్యాంకు సిబ్బంది సహకారంతో ఆయన ఇలా చేశారని అంటున్నారు. అయితే తాము ఢిల్లీలో ఉండడం వల్ల రుణాలు మంజూరైన విషయం తమకు ఆలస్యంగా తెలిసిందని ఫిర్యాదు దారులు అంటున్నారు.

ఇదిలా ఉండగా ఈ కేసుతో తన తండ్రికి ఎటువంటి సంబంధం లేదని సోము వీర్రాజు కూతురు సూర్యకుమారి తెలిపారు. తన తండ్రితో సంబంధాలు తెగిపోయాయని, రాకపోకలు ఎప్పుడో నిలిచాయన్నారు. వ్యాపార లావాదేవీల్లో భాగంగానే రుణాలు తీసుకున్నామన్నారు. అయితే ఉద్దేశ పూర్వకంగానే తమపై కేసు పెట్టారని ఆరోపించారు. కాగా పోలీసులు తమకు ఇంత వరకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. తమ తండ్రి ప్రతిష్ట దెబ్బతీయడానికే కొందరు రాజకీయ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

కాగా ఈ కేసులో వెంకట నరసింహంను పోలీసులు ఇంకా అదుపులోకి తీసుకోలేదు. ఆయన పరారీలో అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా నరసింహకు బాగా తెలిసి వ్యక్తే అని చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మరోవైపు కొందరు ఈ కేసులో సోము వీర్రాజుకు కూడా సంబంధాలున్నాయని ప్రచారం చేస్తున్నారు.
Tags:    

Similar News