వెల్లుల్లితో బ్లడ్ ప్రెజర్ కు చెక్.. ఎలా తీసుకోవాలి?

Update: 2021-05-08 06:31 GMT
మారిన కాలానుగుణంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక ఇటీవల బ్లడ్ ప్రెజర్ అనే సమస్య తరుచుగా వింటున్నాం. దీనిని నియంత్రణలో ఉంచడానికి కొందరు రోజూ మాత్రలు వాడుతారు. క్రమంగా వైద్యులను సంప్రదిస్తారు. కానీ ఇవన్నీ లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలతోనే బీపీని కంట్రోల్ చేయవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బ్లడ్ ప్రెజర్ ను నియంత్రించడానికి చక్కటి ఔషధం వెల్లుల్లి. దీనిలో ఉండే ఔషధ గుణాలేంటో తెలుసుకుందాం రండి.

వెల్లుల్లిలో అల్లిసిన్, డయాలిల్ డై సల్ఫైడ్, డయాలిల్ ట్రై సల్ఫైడ్, సల్ఫర్ సమ్మేళనాలు, సెలీనియం, జెర్మెనియం, ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటన్నింటిలో అల్లిసిన్ పదార్థం ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ ప్రెజర్ ను నియంత్రించడంలో ఇది క్రియాశీల పాత్ర పోషిస్తుంది. పచ్చి వెల్లుల్లిని ముక్కలుగా కోసినప్పుడు, లేదా తినడం ద్వారా అలీనాజ్ విడుదలవుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. రోజూ రెండు వెల్లుల్లి పాయలను తినడం వల్ల అనేక సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు అంటున్నారు నిపుణులు.

వెల్లుల్లిని కేవలం పచ్చిగానే కాకుండా ఇతర రూపాల్లోనూ తీసుకోవచ్చు. వాటిలో ముఖ్యమైనది వెల్లుల్లి టీ. 3 వెల్లుల్లి పాయలను సన్నగా తరిగి పక్కకు పెట్టుకోవాలి. నీటిని బాగా వేడి చేయాలి. నీరు మరుగుతున్నప్పుడు వెల్లుల్లిని చేర్చాలి. ఐదు నిమిషాలు మరగబెట్టాలి. తర్వాత దానిని వడగట్టి తాగేయాలి. అదనపు రుచి కోసం కాస్త తేనెను కలుపుకుంటే సరి. అంతేకాకుండా వెల్లుల్లి పొడిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఇతర అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. రోజూ 600-900 మి.గ్రా వెల్లుల్లి పొడిని తీసుకుంటే బ్లడ్ ప్రెజర్ ను 9-12 శాతం తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వెల్లుల్లిని కూరల్లో, టీ రూపంలో తీసుకోవచ్చు. సలాడ్ లో తరిగిన వెల్లుల్లిని నేరుగా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల అదనపు రుచితో పాటు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. సలాడ్ కోసం ప్రత్యేకంగా సాల్టెడ్ వెల్లుల్లి అందుబాటులో ఉంది. అంతేకాకుండా పులియ బెట్టిన వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల బీపీతో పాటు ఇతర సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బీపీని నియంత్రించవచ్చు. ఎన్నో సమస్యలకు చెక్ పెడుతుంది.




Tags:    

Similar News