ప్రఖ్యాత జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్ పై పాజిటివ్ రిపోర్టులు ఉన్నాయి. ఇటీవల ఆ కంపెనీ వ్యాక్సిన్ ను హైదరాబాదీ కంపెనీ బీఈ (బయలాజికల్ -ఈ) దేశీయంగా తయారు చేసేందుకు అనుమతి పొందింది. సదరు కంపెనీతో ఒప్పందం చేసుకుంది. భారీగా.. సదరు వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు సిద్ధమవుతున్న వేళ.. దేశీయంగా ఈ వ్యాక్సిన్ మీద చాలానే అంచనాలు వ్యక్తమయ్యాయి.
ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్లలో ప్రభావవంతమైన టీకాల్లో ఇదొకటిగా కొందరు అభివర్నించారు. దీంతో.. ఈ వ్యాక్సిన్ పై దేశీయంగా చాలానే అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగాఈ వ్యాక్సిన్ కు అమెరికా ప్రభుత్వం షాకిచ్చింది. ఈ కంపెనీ రూపొందించిన కోవిడ్ టీకాను ప్రజలకు ఇవ్వటం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజాగా అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో చోటు చేసుకుంటున్న సైడ్ ఎఫెక్టుల కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ టీకా తీసుకున్న వారి మెదడులో రక్తం గడ్డకట్టిపోతున్న లక్షణాలు బయటకుు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు.
ఈ టీకాను తీసుకున్న తర్వాత రక్తాన్ని తీసుకొచ్చే నాళాల్లో రక్తం గడ్డకడుతోందని.. అందులో ప్లేట్ లెట్లు తక్కువగా ఉంటున్నట్లుగా గుర్తించారు.మొత్తం 60 లక్షలమందికి పైగా ప్రజలకు ఈ వ్యాక్సిన్ ను ఇప్పటికే ఇచ్చారు. అయితే.. ఆరుగురికి మాత్రం మెదడులో రక్తం గడ్డకట్టిన లక్షణాలు కనిపించాయి. దీంతో.. ఈ వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. యూరోపియన్ యూనియన్ లో అస్ట్రాజెనెకా టీకా ఇచ్చిన వారికి ఇదే తరహాలో లక్షణాలు కనిపించాయి. దేశీయంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న జాన్సన్ వ్యాక్సిన్ పై అమెరికా నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై సదరు కంపెనీ ఇంకా స్పందించలేదు.