అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ అరెస్టయింది మొదలు వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు. చోటా రాజన్ పై మెజార్టీ కేసులు మహారాష్ర్టలో ఉన్నప్పటికీ ఆ రాష్ర్టంలో కాకుండా జాతీయ దర్యాప్తు సంస్థ సీబీఐ విచారించడం దేశంలో ఆసక్తికర పరిణామంగా మారగా... మరో డాన్ దావూద్ ఇబ్రహీంతో ముంబై పోలీసులకు సంబంధాలు ఉన్నాయని చోటా ఆరోపించడం మరింత సంచలనం అయింది. ఈ నేపథ్యంలో చోటా ఆరోపణలు, సీబీఐ విచారణ తదితరాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.
ముంబై పోలీసుల సలహా మేరకే చోటా రాజన్ పై ఉన్న అన్ని కేసులనూ సీబీఐకి బదలాయించినట్లు ఫడ్నవీస్ తెలిపారు. అంతే కానీ ముంబై పోలీసు అధికారులు కొందరికి సంబంధాలున్నాయని ఛోటా రాజన్ చేసిన ఫిర్యాదు వల్ల కాదని అన్నారు. ఛోటా రాజన్ పై ఉన్న కేసులను సీబీఐకి బదలాయిస్తూ నిర్ణయం తీసుకోవడానికి ముందు తాను ముంబై పోలీస్ కమిషనర్ జావెద్ అహ్మద్ సహా సీనియర్ పోలీసు అధికారులందరితో సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆ సమావేశంలో పాల్గొన్న పోలీసు అధికారులందరూ ఛోటారాజన్ పై కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించాల్సిందిగా ఏకగ్రీవంగా చెప్పారని ఫడ్నవీస్ వివరించారు. తమ పోలీసులు విచారణకు నో చెప్పడం వల్లే ఇదంతా జరిగిందని స్పష్టం చేశారు.