రాజ్యాన్ని నడిపించే రాజు ఒక్కసారి డిసైడ్ అయితే.. ఎలా అయినా అతగాడు అనుకున్నది జరుగుతుందన్న విషయం ప్రజాస్వామ్య భారతంలో మరోసారి ఫ్రూవ్ అయ్యిందని చెప్పాలి. కేవలం ఆరోపణల మీదనే సీనియర్ నేత.. మాజీ కేంద్ర హోం మంత్రిగా విధులు నిర్వర్తించిన నేతను అరెస్ట్ చేసిన వైనం సంచలనంగా మారటమే కాదు.. వ్యవస్థకు మించిన పవర్ ఫుల్ మరేదీ లేదన్న వైనాన్ని అందరికి అర్థమయ్యేలా చేసిందని చెప్పాలి.
చిదంబరం మాష్టారి అరెస్ట్ ఎపిసోడ్ ను చూసినంతనే.. అప్రయత్నంగా దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధి గుర్తుకు వస్తారు. జయలలిత వర్సెస్ కరుణ మధ్య నడిచిన రాజకీయ ప్రత్యర్థిత్వంతో ఒకరిని మరొకరు ఎంతలా ద్వేషిస్తారో తెలిసిందే. తనను అరెస్ట్ చేయించిన కరుణను.. తననే ఏ రీతిలో అయితే అరెస్ట్ చేశారో.. సేమ్ టు సేమ్ అన్నట్లుగా అరెస్ట్ చేయించటం ద్వారా ప్రతీకారం తీర్చుకోవటంలో తన తర్వాతే ఎవరైనా అన్నట్లుగా వ్యవహరించారు దివంగత అమ్మ. కరుణ ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో ఒక ఫ్లైఓవర్ కు సంబంధించి రూ.12 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై కరుణను అరెస్ట్ చేశారు.
తాను గుజరాత్ హోం మంత్రిగా ఉన్నప్పుడు సాహోబ్రుద్దీన్ నకిలీ ఎన్ కౌంటర్ లో అరెస్ట్ అయి.. జైల్లో కొంతకాలం గడిపారు అమిత్ షా. తాను జైలు కావటానికి కారణమైన చిదంబరాన్ని అరెస్ట్ చేయించటం ద్వారా తనకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకున్నట్లు చేసుకోవటంలో సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు. చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు బుధవారం రాత్రి వేళలో ఆయన నివాసం ఉన్న ఇంటి గోడల్ని దూకి మరీ వెళ్లి అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది.
వాస్తవానికి చిదంబరాన్ని అరెస్ట్ వార్త కంటే కూడా.. ఆయన్నుఅరెస్ట్ చేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిదంబరాన్ని అరెస్ట్ చేసిన వైనం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. దివంగత కరుణ అరెస్ట్ వ్యవహారాన్ని గుర్తుకు తెచ్చేలా చేసింది. చిదంబరం అరెస్ట్ చేసిన తీరును కాంగ్రెస్ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. గతంలో కరుణను అరెస్ట్ చేసిన సందర్భంగా ఆయన పంచె ఊడిపోతున్నా పట్టించుకోకుండా ఆయన్ను బలవంతంగా పోలీసులు వాహనంలోకి కూర్చోబెట్టిన వైనం అప్పట్లో పెను దుమారంగా మారింది. ఒకప్పుడు కేంద్ర హోంమంత్రి వ్యవహరించిన చిదంబరం తాజాగా అనూహ్య రీతిలో అరెస్ట్ కావటం ఒక ఎత్తు అయితే.. అత్యున్నత పదవుల్ని చేపట్టి.. తర్వాతి కాలంలో అరెస్ట్ అయిన ప్రముఖులుగా నిలిచిన కరుణ.. చిదంబరంలు ఇద్దరూ తమిళులే కావటం గమనార్హం.