మాజీ కేంద్రమంత్రి.. యూపీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన చిదంబరం ఇంట్లో భారీ చోరీ జరిగింది. చెన్నైలోని నుగంబాక్కంలోని సైక్రాప్ట్ గార్డెన్ రోడ్ లోని ఆయనింట్లో చోరీ జరిగింది. నెల రోజుల క్రితం చిదంబరం కుటుంబం ఊటీకి వెళ్లింది. శనివారం రాత్రి వారు తిరిగి వచ్చారు. ఇంటి తలుపులు తీసిన వెంటనే.. బీరువాలు తీసి ఉండటం.. విలువైన వస్తువులు మిస్ అయినట్లుగా గుర్తించారు.
విలువైన ఆభరణాలు.. రూ.1.50 లక్షల నగదు.. ఆరు విలువైన చీరలు చోరీ అయినట్లుగా గుర్తించారు. దీంతో.. వారు సీసీ కెమేరా పుటేజ్ ను పరిశీలించారు. మాస్క్ వేసుకున్న ఇద్దరు మహిళలు ఇంట్లోకి జొరబడి చోరీకి పాల్పడినట్లుగా తేలింది. అయితే.. ఈ ఫుటేజ్ చూడటానికి ముందే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.
అయితే.. ఈ దొంగతనం ఇంట్లో పని చేసే వారే చేసినట్లుగా గుర్తించారు. దీంతో కంగారుపడ్డ వారు.. తాము దొంగలించిన సామాన్లను తీసుకొచ్చి.. తమపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని వేడుకున్నారట. దీంతో.. ఇంట్లో చోరీ చేసిన వారిపై తామిచ్చిన ఫిర్యాదును చిదంబరం కుటుంబ సభ్యులు వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్లుగా వస్తున్న వార్తల్ని కార్తీ చిదంబరం ఖండించారు. చీరలు.. నగదు మాత్రమే దొంగతనానికి గురయ్యాయని ఆయన పేర్కొన్నారు.