ఆదమరిస్తే విచ్ఛిన్నకర శక్తులతో ప్రమాదం.. విమోచనాన బీజేపీపై కేసీఆర్ నిప్పులు
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన వేడుకల్లో కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా బీజేపీని టార్గెట్ చేశారు. కొన్ని మతతత్వ శక్తులు తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయని సీఎం కేసీఆర్ విమర్శించారు. మతోన్మాద శక్తుల నుంచి మరోసారి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్పారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదికి సెప్టెంబర్ 17 ,1948న సువిశాల భారతంలో హైదరాబాద్ విలీనం అయ్యిందని.. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని కేసీఆర్ అన్నారు. ప్రజా పోరాటాలు చేసిన మహనీయులందరికీ స్మరించుకుందామని.. అందరి కృషితోనే నేడు మనం చూస్తున్న భారత దేశం ఆవిష్కృతమైందన్నారు. మతాలకు అతీతంగా దేశ సమైక్యత కృషి జరిగిందన్నారు.
ఇక స్వాతంత్య్రానికి పూర్వమే హైదరాబాద్ ఎంతో అభివృద్ధిలో ఉండేదని.. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ పేరుతో హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా ఏపీలో కలిపారని కేసీఆర్ ఆక్షేపించారు. ఆ విలీనంపై హైదరాబాద్ ప్రజలు అప్పుడే ఆందోళన చేశారని.. ఆనాటి ఏమరపాటు వల్ల 58 ఏళ్లు ఎంతో నష్టపోయామని అన్నారు. సుధీర్ఘ పోరాటం తర్వాత మళ్లీ తెలంగాణప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి నేడు అన్ని రంగాల్లో ముందుందన్నారు.
దొడ్డి కొమురయ్య, కొమురం భీమ్ సాహసాలను మరువలేమని.. చాకలి ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగిద్దామని.. నాటి వారి కృషి వల్లే ఇప్పుడు తెలంగాణ రూపుదిద్దుకుందని.. దేశంలో తెలంగాణ అంతర్భాగమయ్యాక సొంత రాష్ట్రంగా మారిందన్నారు. ఎందరో మహానుభావులు సామాజిక చైతన్యాన్ని రగిలించారని.. తెలంగాణ ప్రజల ఇష్టానికి ఏపీలో కలిపారని ఆక్షేపించారు.
నాటి చరిత్ర నుంచి అనుభవాలు నేర్చుకోవాలని.. అటువంటి వేదన మళ్లీ తెలంగాణ కు రాకూడదన్నారు. మతతత్వ తెలంగాణను విభజించే కుట్ర చేస్తున్నామని తెలిపారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా తీవ్రంగా నష్టపోతామని హెచ్చరించారు.
చరిత్రను వక్రీకరించి తెలంగాణను మలినం చేసే కుట్రలు చేస్తున్నారని కేసీఆర్ ఈ సందర్భంగా బీజేపీపై నిప్పులు చెరిగారు. నిజాంను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. రెప్పపాటు కాలం ఆదమరిచినా విచ్చిన్నకర శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉంటుందని కేసీఆర్ హెచ్చరించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.