జెండా పండుగ : కూట‌మి రాజ‌కీయానికి కేసీఆర్ సై !

Update: 2022-04-27 09:30 GMT
భాగ్య‌న‌గ‌రి వాకిట ఇవాళ టీఆర్ఎస్ ప్లీన‌రీ జ‌రుగుతోంది. సింపుల్ గా చెప్పాలంటే గులాబీ జెండా పండుగ. తెలంగాణ ఆవిర్భావోత్స‌వం. ఈ సంద‌ర్భంగా శ్రేణులు ఎంతో  ఉత్సాహంతో క‌దులుతున్నాయి. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేర‌కు వాడ‌వాడ‌లా గులాబీ జెండాలు రెప‌రెప‌లాడుతున్నాయి.

అంతా నాటి ఉద్య‌మ రోజుల‌ను, నాటి ఉద్య‌మ స్ఫూర్తిని ర‌గ‌లించిన నాయ‌కుల‌ను స్మ‌రించుకుంటున్నారు. ఆ రోజు సమైక్య పాల‌కుల హ‌యాంలో పోలీసులు న‌డుచుకున్న విధానం, అదేవిధంగా తెలంగాణ నాయ‌కులు కొంద‌రు అటు ఉద్య‌మంలో లేక‌పోయినా ఇవాళ ప‌ద‌వులు పొందిన వైనం ఇవ‌న్నీ కూడా చాలా మంది సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు త‌లుచుకుంటున్నారు.

తెలంగాణ త‌ల్లికి వంద‌నాలు చెల్లించి అమ్మ‌ను, అమ‌రుల‌ను స్మ‌రించు కుంటున్నారు. నేల‌తో ఉన్న బంధాన్ని తలుచుకుంటున్నారు. అడ‌వితో ఉన్న బంధాన్నీ బాంధ‌వ్యాన్నీ త‌లుచుకుంటున్నారు. తుపాకీ గొట్టాల నీడ‌ల్లో మండుటెండ‌ల్లో ధ‌ర్నా చౌక్ దారుల్లో చేసిన ధ‌ర్మ పోరాటం గురించి మాట్లాడుకుంటున్నారు.

ఇంకా ఎన్నో స్మ‌ర‌ణ‌కు  తూగుతున్నాయి ఇవాళ. ఇంకా ఎన్నో ప్లీన‌రీ వేళ ప్ర‌స్తావ‌నకు మ‌రియు విశ్లేష‌ణ‌కు మ‌రియు ప‌రిధి విస్త‌ర‌ణ‌కు నోచుకుంటున్నాయి ఇవాళ. ఒక‌నాటి భావోద్వేగాలు అన్నీ ఇవాళ స్మ‌ర‌ణ‌కు వ‌స్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన  రాజ‌కీయ నాయ‌కులు పొందిన అవ‌మానాలు కూడా యాదికొస్తున్నాయి. మిలియ‌న్ మార్చ్ లాంటి అతి పెద్ద నిర‌స‌న‌ల వేళ పోలీసులు ప్ర‌వ‌ర్తించిన తీరు, ఆ రోజు ట్యాంక్ బండ్ ద‌గ్గ‌ర జ‌రిగిన ప‌రిణామాలు ఇవ‌న్నీ కూడా ఇవాళ గుర్తుకు వ‌స్తున్నాయి ఇంకొంద‌రు యాక్టివిస్టుల‌కు.

సాధించుకున్న తెలంగాణ ఒక్క పార్టీ ప‌రం కావ‌డం బాలేద‌న్న బాధ కూడా కొంద‌రిలో ఉంది. ఈ నేప‌థ్యంలో విమ‌ర్శ‌లూ ప్ర‌తివిమర్శ‌లూ ఎలా ఉన్నా తెలంగాణ ఇంటి పార్టీ పెద్ద కేసీఆర్ ప్లీన‌రీని ఉద్దేశించి మాట్లాడారు. తాను ఏ పార్టీకీ వ్య‌తిరేకంగా కూట‌మి ఏర్పాటు చేయ‌డం లేద‌ని అన్నారు.

దేశ ప్ర‌జ‌ల‌కు అనుకూలంగా ఉండే కూట‌మిని మాత్ర‌మే ఏర్పాటు చేస్తాన‌ని, అదేవిధంగా నూత‌న పారిశ్రామిక విధానం అదే విధంగా నూత‌న వ్యవ‌సాయ విధానం రావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.
Tags:    

Similar News