మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో మధ్యప్రదేశ్ లో వరదలు వచ్చినప్పుడు కూడా భద్రతా సిబ్బంది ఆయనను మోసుకెళ్లడం - దానిపై విమర్శలు రావడం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటన చోటుచేసుకొని శివరాజ్ సింగ్ చౌహాన్ బూట్లను భద్రత అధికారి చేతుల్లో పట్టుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భారతీయ జనతా పార్టీ శిక్షణా శిబిరానికి హాజరు కావడానికి ఉజ్జయినీకి శివరాజ్ సింగ్ చౌహాన్ వెళ్లారు. దారిలో జైన మత సన్యాసి ప్రగ్యా సాగర్ ఆశ్రమం వద్ద ఆగారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ తన బూట్లను విప్పారు. అనంతరం దగ్గర్లోనే ఉన్న శిక్షణా శిబిరానికి బూట్లు లేకుండానే నడుచుకుంటూ వెళ్లారు. అయితే ఆయన బూట్లను భద్రత అధికారి చేతుల్లో పట్టుకొని వెంట నడిచారు. అక్కడ ఉన్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ తో ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. ఈ పరిణామంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పరిపాలనలో మేటి అని నిరూపించుకున్న శివరాజ్ సింగ్ ఇలా తన స్థాయికి తగిన పనులు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/