ముఖ్యమంత్రులకు సుప్రీం కానుక

Update: 2016-03-18 07:28 GMT
ప్రభుత్వ ప్రకటనలలో కేంద్ర మంత్రులు - ముఖ్యమంత్రులు - రాష్ట్రాల గవర్నర్లు - రాష్ట్ర మంత్రుల ఫొటోలను ఉపయోగించడానికి సుప్రీం కోర్టు ఈ రోజు అనుమతించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు గతంలో తాను ఇచ్చిన ఆదేశాలను సవరించింది. గత తీర్పులో సుప్రీం కోర్టు ప్రభుత్వ ప్రకటనలలో ప్రధాన మంత్రి - రాష్ట్రపతి - సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తలు ఫొటోలు మినహా రాజకీయ నాయకుల ఫొటోలు ఉపయోగించరాదని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాడు - పశ్చిమ బెంగాల్ - ఉత్తర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు తీర్పును సమీక్షించాల్సిందిగా కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఫెడరల్ వ్యవస్థలో ముఖ్యమంత్రి - ప్రధాన మంత్రికి పెద్ద తేడా లేదనీ, కనుక ప్రధాని - రాష్ట్రపతి- సీజేై ఫొటోలు మాత్రమే ప్రభుత్వ ప్రకటనలలో కనిపించాలనడం సరికాదని ఆ పిటిషన్ లో పేర్కొన్నాయి.

ఈ పిటిషన్లను విచారించిన అనంతరం జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.  ప్రభుత్వ ప్రకటనల్లో రాష్ర్టపతి - ప్రధాని - చీఫ్ జస్టిస్ మినహా ఇతరుల చిత్రాలు ప్రచురించరాదని. గత ఏడాది మే 13న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఆ తరువాత వివిధ రాష్ట్రాలు పిటిషన్ల రూపంతో అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. అనంతరం అక్టోబరు 27న కేంద్రం కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయింది.. రాష్ట్రాల అభ్యంతరాలను పరిశీలించాలంటూ కోర్టును కోరింది. విచారణ అనంతరం కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న పశ్చిమబెంగాల్ - తమిళనాడు తదితర రాష్ట్రాలకూ ఇది వర్తిస్తుంది.
Tags:    

Similar News