బెంగాల్ లో మహిళ అరెస్ట్... సైఫ్ కేసుకీ ఈమెకీ సంబంధం ఇదే!

అవును... సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటన కేసులో ముంబై పోలీసులు పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ మహిళను తాజాగా అరెస్ట్ చేశారని తెలుస్తోంది.

Update: 2025-01-27 14:17 GMT

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై బాంద్రాలోని తన నివాసంలో జరిగిన దాడి ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ దాడి అనంతరం ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుని ఇటీవల డిశ్చార్జ్ అయిన సైఫ్.. ప్రస్తుతం కోలుకుంటున్నారని అంటున్నారు. మరోపక్క ఈ దాడిఘటనపై ముంబై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా... ఇప్పటికే నిందితుడు షరీఫుల్ తో సైఫ్ ఇంట క్రైమ్ సీన్ రీ-క్రియేషన్ చేశారని చెబుతున్నారు. ఘటనా స్థలంలో దొరికిన 19 వేలిముద్రలతో నిందితుడి వేలి ముద్రలు మ్యాచ్ కాకపోవడంతో.. మరోసారి వాటిని సేకరించనున్నారని చెబుతున్నారు. ఈ సమయంలో ఓ అనూహ్య పరిణాం తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఓ మహిళను అరెస్ట్ చేశారు!

అవును... సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటన కేసులో ముంబై పోలీసులు పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ మహిళను తాజాగా అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ముంబైలో సైఫ్ పై జరిగిన దాడికి, పశ్చిమ బెంగాల్ లో ఉన్న మహిళకు ఏమిటి సంబంధం అనే చర్చ ఈ సందర్భంగా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో.. పోలీసులు వివరాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా... పశ్చిమ బెంగాల్ లోని నదియా జిల్లా చప్రాకు చెందిన మహిళకు, సైఫ్ పై దాడి ఘటనలో నిందితుడు షరీఫుల్ తో పరిచయం ఉందని.. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ప్రవేశించినప్పటి నుంచి ఆ మహిళతో టచ్ లో ఉన్నాడని.. నిందితుడు వినియోగించిన సిమ్ కార్డు ఈ మహిళ పేరుతో ఉన్నట్లు గుర్తించారని పోలీసులు తెలిపారు.

ఈ సమయంలో ఆమెను ముంబై పోలీసులు ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. సైఫ్ ఇంట్లో దోపిడికి యత్నించే విషయంతో పాటు.. షరీఫుల్ బంగ్లాదేశ్ నుంచి రావడం, ఈమె పేరుమీద సిమ్ కార్డు తీసుకోవడం మొదలైన విషయాలపై ఆరా తీస్తున్నారని చెబుతున్నారు.

మరోవైపు... ఈ కేసు దర్యాప్తులో భాగంగా సైఫ్ పై దాడి జరిగిన ప్రదేశంలోని వేలి ముద్రలను ఫోరెన్సిక్ అధికారులు సేకరించినట్లు చెబుతున్నారు. అయితే.. అక్కడ నుంచి సేకరించిన వేలిముద్రలతో నిందితుడిగా చెబుతున్న షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలు మ్యాచ్ కాలేదని అంటున్నారు. దీంతో.. మరోసారి ఘటనా స్థలం నుంచి మరిన్ని నమూనాలను సేకరించనున్నారని తెలుస్తోంది!

Tags:    

Similar News