సారు స్వయంగా ప్లాన్ చేసినా.. రిమాండ్ కు వెళ్లకపోవటమా?

Update: 2022-10-29 08:30 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నంతనే చాలామంది రాజకీయ పార్టీ అధినేతలు కాసింత జాగ్రత్తగా ఉంటారని చెబుతుంటారు. ఆయన్ను ఏ విషయంలో నమ్మొచ్చు? మరే విషయంలో నమ్మకూడదు? అన్న దానిపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తమవుతుంటాయని చెబుతుంటారు. ఆయన ఎప్పుడు ఏం చేస్తారో ఒక పట్టాన అర్థం కాదంటారు. అందుకే.. ఆయనతో డీల్ చేస్తే చాలా అప్రమత్తంగా ఉండాలన్న టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తూ ఉంటుంది.

తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేసిన ఉదంతంలో.. రివర్సు గేరులో తనను టార్గెట్ చేసిన వారినే టార్గెట్ చేసి.. సీక్రెట్ కెమేరాలు.. ఫోన్ సంభాషణల్ని రహస్యంగా రికార్డు చేయటం లాంటి వాటితో పక్కా వ్యూహాన్ని కేసీఆర్ సిద్దం చేసినట్లుగా చెబుతున్నారు.

తమ ఎమ్మెల్యేల్ని ట్రాప్ చేసిన విషయాన్ని నాలుగు రోజుల ముందే గుర్తించిన కేసీఆర్.. దాన్ని తిప్పి కొట్టేందుకు వీలుగా రివర్సు గేరులో ప్లాన్ చేశారు. ఇందుకు ఆయన కీలక పోలీసు అధికారుల సాయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.

అంతేకాదు.. తాము బుక్ చేసిన వారిని.. రిమాండ్ కు పంపటానికి అవసరమైన అన్ని కసరత్తులు చేసినప్పటికీ.. అందుకు భిన్నంగా రిమాండ్ కు వెళ్లకుండా బయటకు వచ్చేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ప్లాన్ చేయటం.. తనకు అత్యంత నమ్మకస్తుడైన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు దగ్గరుండి మరీ ప్లాన్ చెప్పి అమలు చేయించినప్పటికీ.. న్యాయస్థానం నుంచి వారు బయటకు రావటాన్ని కేసీఆర్ అండ్ కో జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. ఎక్కడ తేడా జరిగింది? తాము అనుకున్నది అనుకున్నట్లుగా ఎందుకు జరగలేదు? అన్నదానిపై పోస్టుమార్టం జరిగినట్లుగా చెబుతున్నారు.

నిందితులపై మోపిన ఆరోపణలకు తగిన సాక్ష్యాలు లేని కారణంగా కోర్టు వారిని రిమాండ్ కు పంపని వైనం తెలిసిందే. దీంతో.. కేసీఆర్ అండ్ కో కంగుతిన్నట్లుగా తెలుస్తోంది. దీంతో.. తాము ప్లాన్ చేసిన దానిలో ఎక్కడ తప్పులు దొర్లాయన్న అంశాన్ని గుర్తించే ప్రయత్నంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికి జరిగిందేదో జరిగినా.. ఇకపై ఇలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు వీలుగా మరింత పక్కాగా ప్లాన్ చేయాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News