ప్రధాన పార్టీల్లో చికోటి ప్రకంపనలు

Update: 2022-07-30 05:30 GMT
తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది స్టేట్స్ అయిపోయిన క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ తో ఎవరెవరికి లింకులున్నాయి ? ఇపుడిదే ఫ్రశ్న రాజకీయ పార్టీల్లో బాగా చక్కర్లు కొడుతున్నాయి. చికోటి వ్యవహారం వెలుగు చూడగానే ముందు తెలుగుదేశం పార్టీ బురద రాజకీయం అందుకుంది. చికోటితో పాటు నేపాల్, శ్రీలంక, బ్యాంకాక్ కు వెళ్ళి క్యాసినో ఆడింది మాజీమంత్రి కొడాలినాని, ఎంఎల్ఏ వల్లభనేని వంశీయే అని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు.

కొడాలి, వంశీ పై దేశాలకు వెళ్ళి క్యాసినోలు ఆడినట్లు వర్ల దగ్గరున్న ఆధారాలేమిటో ఎవరికీ తెలీదు. కానీ వైసీపీని ఇబ్బందులు పెట్టే అవకాశం వచ్చింది కదాని రెచ్చిపోయారంతే. దానికి బదులుగా కొడాలి మాట్లాడుతూ తనకు చికోటికి ఎలాంటి సంబంధాలు లేవని ప్రకటించారు. టీడీపీకి దమ్ముంటే తమపై ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ కు ఫిర్యాదులు చేసి కేసులు నమోదు చేయించ్చని సవాలు విసిరారు. దానికి టీడీపీ నుండి ఎలాంటి సమాధానం రాలేదు.

సీన్ కట్ చేస్తే ఇపుడలాంటి ఆరోపణలనే జగన్మోహన్ రెడ్డి మీడియా మొదలుపెట్టింది. చికోటి ప్రవీణ్ తో సంబంధాలున్నది టీడీపీ మాజీ ఎంఎల్ఏ బోడె ప్రసాద్ కే అని పెద్ద కథనం ఇచ్చింది. చికోటి సాయంతో బోడెప్రసాద్ గతంలోనే క్యాసినో నిర్వహించేందుకు చేసిన ప్రయత్నాలను, ఏర్పాట్లను సదరు మీడియా బయటపెట్టింది. బోడె తరకు బ్యాంకాక్, శ్రీలంక, సింగపూర్ కు వెళ్ళినట్లు కూడా చెప్పింది.

ఇంతకీ విషయం ఏమిటంటే ప్రవీణ్ తో సంబంధాలున్న రాజకీయనేతలెవరు ? ప్రజాప్రతినిధులు ఎవరు అనే విషయాలు ఇంకా బయటకు రాలేదు. అన్నీ పార్టీల్లోని ప్రజాప్రతినిధులకు చికోటితో సంబంధాలుండే ఉంటాయనటంలో సందేహం లేదు.

ఎందుకంటే అవసరమైనపుడు తన రక్షణకు ఉపయోగపడతారన్న ఆలోచనతో చికోటి లాంటి వాళ్ళు ముందుజాగ్రత్తగా ప్రజాప్రతినిధులతో మంచి సంబంధాలను మైన్ టైన్  చేయటం చాలా సహజం.

వెలుగు చూస్తున్న వివరాల ప్రకారం ఇపుడు జరిగింది కూడా అదే అని అర్ధమవుతోంది. రెండు పార్టీల్లోని నేతలకు చికోటితో సంబంధాలున్నపుడు ఒకరిపై మరొకరు బురదచల్లుకోవటం ఎందుకు ?
Tags:    

Similar News