చైనా సైన్యంలో ‘కాపీ’ వీరులు

Update: 2020-09-23 01:30 GMT
భారత సైనికులను దొంగ దెబ్బ తీయడం. నయవంచనకు గురిచేయడం, ఆత్మస్థైర్యం దెబ్బ తినేలా వ్యవహరించడం చైనా సైన్యానికి కొత్తది కాదు. ఇటీవల పలు సందర్బాల్లో చీటికి మాటికి భారత్​ తో చైనా కయ్యానికి కాలు దువ్వుతున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన యాప్​లన్నీ నిషేధించడంతో ఆ దేశ వాణిజ్యం పడిపోయింది. ఈ పరిస్థితిని చైనా ఊహించ లేకపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు చైనాకు చెందిన సైనికాధికారులు ఆర్మీని ఉత్తేజ పరిచేందుకు ఇటీవల ఓ వీడియో ను రూపొందించారు. అయితే ఆ వీడియో ను హాలీవుడ్​ సినిమా లోని ఓ దృశ్యాన్ని యథాతథంగా కాపీ కొట్టి రూపొందించారు.

ఈ వీడియో పై ప్రస్తుతం నెట్టింట్లో తీవ్ర దుమారం రేగింది. వివిధ దేశాలకు చెందిన నెటిజన్లు చైనాపై ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ‘ మీరిక మారరా! చివరకు సైన్యం తయారు చేసే వీడియోలు కూడా కాపీ కొట్టి తయారు చేస్తారు. అంటే సొంత తెలివి తేటలు లేవు.. ఇతరుల క్రియేటివిటీని దొంగిలిస్తాం అని ఒప్పుకున్నట్టేనా’ అంటూ ఓ నెటిజన్  కామెంట్​ పెట్టాడు. ‘ఇటువంటి వీడియోలు చైనా కాపీ కొట్టడం కామనా.. మీరు ఇప్పుడు గుర్తించారేమో..కావాలంటే ఓల్డ్​ వీడియోలు చూసుకోండి’ అంటూ చైనాకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.

వీడియోలో ఏముందంటే..

చైనా సైన్యం తయారు చేసిన వీడియోలు అణు సామర్థ్యం కలిగిన హెచ్-6 బాంబులతో కూడిన విమానాలు, పసిఫిక్ ద్వీపమైన గువాంలో యూఎస్ స్థావరాలుగా కనిపించేవాటిపై దాడి చేసినట్టు చిత్రీకరించారు. అయితే ఈ వీడియో ను చైనా కు చెందిన వెబ్​ సైట్​ సీనా వియబోలో దాదాపు 50 లక్షల మంది వీక్షించారు.  'గాడ్స్ ఆఫ్ వార్ - అటాక్' పేరుతో రెండు నిమిషాల నిడివిగల వీడియో ను చైనా వైమానిక దళం శనివారం విడుదల చేసింది. 'మాతృభూమిని రక్షించుకునేందుకు మేము సిద్ధంగా ఉంటాం. మా శక్తి  మాతృదేశ రక్షణ కు వినియోగిస్తాం' అంటూ ఓ కామెంట్ ​ను వీడియో కోసం జత చేశారు.
Tags:    

Similar News