ఏలియ‌న్ల కోసం చైనా ఎత్తుల‌తో వినాశ‌నం త‌ప్ప‌దా?

Update: 2017-11-12 09:27 GMT
అన్ని రంగాల్లోనూ త‌న ఆదిప‌త్యం చాటుకోవాల‌నే ఆకాంక్ష‌తో ముందుకు సాగే డ్రాగ‌న్ కంట్రీ చైనా...అంత‌రిక్షంపై క‌న్నేయడం..ఏలియ‌న్ల రాక‌పోక‌లు...ఎత్తుగ‌డ‌ల‌పై స‌మాచారాన్ని సేకరించాల‌నే ప్ర‌య‌త్నం చేయ‌డం క‌ల‌క‌లంగా మారుతోంది. ఏలియ‌న్ల ఉనికిపై పూర్తి స్ప‌ష్ట‌త రాన‌ప్ప‌టికీ...చైనా మాత్రం వారితో మంత‌నాలు సాగించేందుకు ఏకంగా అతిపెద్ద రేడియో డిష్‌ ప్రాజెక్టు ఏర్పాటుతో ముందుకు సాగ‌డంపై నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. చైనా వాల్‌ దగ్గర గ్రహాంతర క్షిపణి(ఫ్లైయింగ్‌ సాసర్‌) అంటూ చైనా ప్రభుత్వం గత వారం విడుదల చేసిన ఫోటో క‌ల‌క‌లం ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌క‌ముందే...తాజా ప‌రిణామం వెలుగులోకి రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

అగ్ర‌రాజ్యాల త‌ర‌హాలోనే అన్ని రంగాల్లో త‌న ప‌ట్టును క‌లిగి ఉండాల‌నే చైనీయుల‌ ఆకాంక్ష‌కు అధ్యక్షుడు జిన్‌ పింగ్ అత్యుత్సాహం తోడ‌యింది. దీంతో వందల కోట్ల ఖర్చుతో 500 మీటర్ల గోళాకార రేడియో డిష్‌ను నెలకొల్పింది. పాలపుంతల్లోని ఏలియన్స్‌ ఉనికిని తెలుసుకునేందుకు ఈ రేడియో డిష్ ఖగోళంలోని సూదూర ప్రాంతాలకు సిగ్నల్స్‌ ను పంపగలదు. ప్యూర్టోరికోలో ఉన్న దానికంటే రెండింతలు పెద్దదైన ఈ డిష్ ద్వారా ఏలియ‌న్స్ ఉనికిని క‌నిపెట్ట‌డంలో త‌మ ముంద‌డుగు ఉండాల‌ని చైనా డిసైడ‌యింది. 2016లో టియాంగ్‌గాంగ్‌-2ను ప్రయోగించి అమెరికా, రష్యాల కంటే అతిపెద్ద స్పేస్‌ ఎక్స్‌ ప్లోరర్‌ పవర్‌హౌజ్‌గా నిలిచిన చైనా తీసుకున్న ఈ నిర్ణ‌యంపై ఇప్పుడు భిన్న‌భిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇప్ప‌టికే ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ ఎలియన్స్ గురించి త‌న ఆందోళ‌న‌ను వెలిబుచ్చిన సంగ‌తి తెలిసిందే.  మనిషికంటే తెలివైన ఏలియ‌న్స్‌తో మానవాళికి చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. కొలంబ‌స్ అమెరికాను క‌నిపెట్ట‌డం వంటిదే..ఏలియ‌న్స్ ఉనికి తెలుసుకోవ‌డం కూడా అని హాకింగ్ సూత్రీక‌రించారు. మ‌రోవైపు చైనాకు చెందిన రచయిత, గ్రహాంతరవాసులపై సుదీర్ఘ అధ్యయనాలు చేసిన పరిశోధకారుడు లియూ సిక్సిన్ సైతం త‌మ దేశం చ‌ర్య‌ను తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం అనూహ్యంగా మారింద‌ని పేర్కొంటూ ఎలియన్లు-మానవాళి ఒక్కసారి ఎదురుపడినా సృష్టి వినాశనం జ‌రగ‌డమే అని త‌న ఆందోళ‌న‌ను వెలిబుచ్చారు.
Tags:    

Similar News