చైనాలో యాంటీ వైరస్ కార్లా? నిజమేనా?

Update: 2020-05-04 09:30 GMT
కరోనా వైరస్ పుట్టుకకు కారణమైనా చైనాలో ఇప్పుడా వైరస్ ను పూర్తిగా నియంత్రించారు. అయితే ప్రజల్లో మాత్రం కరోనా భయం పోలేదు. వారు ప్రజా రవాణాను అస్సలు ఉపయోగించడం లేదు. దీంతో వారి భయాందోళనలు దృష్టిలో పెట్టుకొని చైనాలో కార్ల ఉత్పత్తిదారులు యాంటీ వైరస్ ఫీచర్లతో వాహనాలు ప్రవేశపెట్టినట్టు వార్తలొచ్చాయి. ప్రపంచంలో దేన్నైనా పుట్టించే సామర్థ్యం ఉన్న చైనావాళ్లకు ఈ యాంటీ వైరస్ కార్లు తయారు చేయడం ఓ లెక్కా అని అందరూ అనుకుంటున్నారు.

 కొత్తగా తయారు చేసే మోడల్ కార్లలో ఫేస్ మాస్క్ ఇచ్చే రక్షణని కారులోపల ఏర్పాటు చేశారంట.. ‘గీలి’ అనే కార్ల సంస్త అలాంటి కార్లని మార్కెట్లో రిలీజ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. లండన్ బ్లాక్ క్యాబ్స్ అనే కార్లని గీలి సంస్థ తయారు చేస్తుంటుంది.

కరోనాతో చైనాలో తొలి త్రైమాసికంలో కార్ల అమ్మకాలు పెద్ద ఎత్తున పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అదే పరిస్థితి. దీంతో కొత్తగా ఆలోచించిన గీలి సంస్థ యాంటి వైరస్ ఫీచర్స్ తో కార్లని తయారు చేసిన తొలి సంస్థగా నిలిచిందంటున్నారు.

ఇక గాలి కాలుష్యంతో నగరాలు కలుషితమై మనుషుల ప్రాణాలు పోతున్న దృష్ట్యా సూక్ష్మ కణాలు కారులోకి రాకుండా గీలి సంస్థ ‘హెల్త్ కేర్ ప్రాజెక్టు’ చేపట్టింది. ఇక కారు స్టీరింగ్, డోర్ హ్యాండిల్స్ ను బ్యాక్టీరియా, వైరస్ రహితంగా చేయడానికి యాంటీ మైక్రోబియల్ పదార్థాలని తయారు చేసింది. ఇక ఏసీల నుంచి కరోనా వ్యాపించకుండా మూడు స్థాయిలలో ఫిల్టరింగ్ ఏర్పాటు చేశారు.

ఇక చైనా మార్కెట్ రీసెర్చ్ గ్రూపు మాత్రం ఈ కార్ల తయారీ వార్తలను ఖండించారు. కొంత మంది తమ ఉత్పత్తులు అమ్మడానికి.. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడానికే ప్రస్తుత భయానక పరిస్థితులను వాడుకుంటున్నారని తెలిపారు.

ప్రస్తుతం చైనాలో కార్ల అమ్మకాలు కరోనా దెబ్బకు 80శాతం పడిపోయాయి. ఏప్రిల్ నుంచి పనులు వచ్చినా అమ్మకాలు పెరగడం లేదట.. అందరూ జాగ్రత్తగా వెళుతూ వస్తున్నారు. ఎక్కువగా సొంత కార్లనే వాడుతున్నారు. కార్ల డిమాండ్ పెరగొచ్చన్న అంచనాలు నేపథ్యంలో చైనా సర్కార్ వాహనాలపై రిబేట్ ఇచ్చింది. పాత కార్లని కొంటోంది. కానీ కొందరు కార్ల కంపెనీలు కరోనా వైరస్ భయాలను క్యాష్ చేసుకొని ఇలా యాంటీ వైరల్ కార్లు అంటూ హంగామా చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
Tags:    

Similar News