పేరుకే అగ్రరాజ్యం. చేష్టలు మాత్రం చిల్లరగా ఉంటున్నాయి. ప్రపంచమంతా కరోనా బారిన పడి విలవిలలాడిపోతుంటే.. అలాంటివేళ.. అగ్రరాజ్యం ముందుండి ప్రపంచానికి దిశానిర్దేశం చేయాలి. కుదరదంటే గమ్మున కూర్చోవాలి. కానీ.. తన కండబలాన్ని పనికిమాలిన విషయాల మీద ప్రదర్శిస్తున్న తీరుపై యావత్ ప్రపంచం మొత్తం తిట్టిపోస్తోంది. అమెరికా లాంటి దేశం.. మరీ ఇంత చిల్లరగా వ్యవహరించటమా? అని విస్మయానికి గురవుతున్నారు. ఇంతకీ.. ఈ ఉదంతం ఏమిటి? ఎక్కడ చోటు చేసుకుందన్న విషయాల్లోకి వెలితే..
చైనా రాజధాని బీజింగ్ నుంచి షాంఘైకు ఒక విమానం వచ్చింది. దాని నిండా లక్షలాది మాస్కులతో కూడిన బండిల్స్ ఉన్నాయి. అవన్నీ మెడికల్.. పారామెడికల్ సిబ్బంది కోసం తయారు చేసిన ఎన్ 95 తరహా కట్టుదిట్టమైన మాస్క్ లు. వీటి కోసం ఫ్రాన్స్ ఆర్డర్ ఇవ్వటంతో తయారు చేసి.. ఆ దేశానికి పంపేందుకు సిద్దమవుతున్నారు. ఇలాంటివేళ.. నలుగురు వ్యక్తులు చైనా అధికారులతో బేరాలు మొదలు పెట్టారు. మాస్కుల స్టాక్ మొత్తాన్ని తమకు ఇవ్వాల్సిందిగా కోరారు. అందుకు చైనా అధికారులు ఒప్పుకోలేదు.
సరే.. రెండు రెట్లు ఎక్కువ ధర చెల్లిస్తామని బేరం పెట్టారు. అందుకు చైనా అధికారులు నో చెప్పారు. చివరకూ మూడు రెట్లు ధర ఎక్కువ చెల్లిస్తామనటమే కాదు.. పెద్ద స్థాయిలో ఒత్తిళ్లను షురూ చేశారు. ఫ్రాన్స్ కంటే మా దేశంలోనే కేసులు ఎక్కువ. మా దేశంలో చైనీయులు ఎక్కువ మంది ఉన్నారు.. మీరు మొదట సహకరించాల్సింది మాకే అంటూ ఎక్కడ కొట్టాలో అక్కడ గురి చూసి కొట్టారు. అంతే.. అప్పటివరకూ మాట మీద నిలబడతామన్న చైనా అధికారులు అమెరికన్ల మాటల ఎత్తులకు.. ఎర చూపిన డబ్బుకు దాసోహం అయ్యారు. అంతే.. ఫ్రాన్స్ కు వెళ్లాల్సిన సరకు విమానం అమెరికాకు ఎగిరెళ్లిపోయింది.
అలా ఫ్రాన్స్ కు వెళ్లాల్సిన మాస్కుల స్టాక్ మొత్తాన్ని అమెరికా గద్దలా కొట్టుకుపోయాయి. ఈవ్యవహారం బయటకు వచ్చింది. అంతర్జాతీయంగా పెను దుమారంగా మారింది. తమ దేశానికి రావాల్సిన మాస్కుల్ని.. ఇలా ఒత్తిళ్లు చేసి దారి తప్పించటం ఏమిటన్న ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇది అనైతిక చర్యగా ఆ చిన్న దేశం విపరీతంగా వేదన చెందుతోంది. తన అక్రోశాన్ని ప్రపంచానికి తెలియజేస్తోంది. అయినప్పటికి ఫలితం లేని పరిస్థితి. తమ దేశం నుంచి మాస్కుల్ని పెద్ద ఎత్తున తరలించారని.. దాని వెనుక ఎవరున్నారో తేల్చాలని కెనడా ప్రధానమంత్రి ట్రూడోకూడా వ్యాఖ్యానించటం గమనార్హం. కెనడాకు తోడుగా బ్రెజిల్ సైతం ఇదే వాదనను వినిపించింది. తమ దేశానికి రావాల్సిన మాస్కులు.. వెంటిలేటర్లు దారి మళ్లినట్లుగా బ్రెజిల్.. చెక్ రిపబ్లిక్ దేశాలు ఆరోపించటం చూస్తుంటే.. అగ్రరాజ్యానికి మరీ ఇంత కురచ బుద్ధా? అన్న చిరాకు కలుగక మానదు.