భారత్ ను దెబ్బకొట్టడానికి చైనా తాజా వ్యూహం

Update: 2021-03-13 13:30 GMT
మనదేశాన్ని ఇబ్బందులకు గురిచేయటానికి చాలా కాలంగా డ్రాగన్ దేశం చేయని ప్రయత్నంలేదు. సరిహద్దుల్లో కాపలాకాస్తున్న సైనికులపై దాడులు, ఆయుధాల మోహరింపు, సరిహద్దు రేఖ దగ్గర్ భారీ స్ధాయిలో సైనికులను మోహరించటం ద్వారా ఉద్రిక్తతలు పెంచేయటం లాంటి అనేక చర్యలకు దిగుతోంది. సరే ఎప్పటికప్పుడు మనదేశం కూడా అంతే ధీటుగా స్పందిస్తు చైనా చేష్టలను తిప్పికొడుతోంది.

ఇంతకాలం చేసిన ప్రయత్నాలు ఒక ఎత్తైతే తాజాగా చేయబోయే ప్రయత్నం మాత్రం చాలా ప్రమాధకరమనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే బ్రహ్మపుత్ర నదిపై భారీ స్ధాయిలో జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించబోతోంది. ఈ కేంద్రం నిర్మించేందుకు అవసరమైన అన్నీ అనుమతులకు చైనా పీపుల్స్ పార్లమెంటు ఆమోదంతెలిపింది.  అంటే వివిధ రంగాల్లో 60 రకాల ప్రాజెక్టులను ఏర్పాటు చేసే 14వ పంచవర్ష ప్రణాళికకు పార్లమెంటు ఓకే చెప్పింది.

పార్లమెంటు ఆమోదించిన 60 రకాల ప్రాజెక్టుల్లో భారీ జల విద్యుత్ కేంద్రం కూడా ఉంది. ఇప్పటికే యాంగ్జీ నదిపై డ్రాగన్ ప్రభుత్వం త్రీ గోర్జెస్ డ్యాంలో నిర్మించిన జల విద్యుత్ ప్రాజెక్టే ప్రపంచంలోని భారీ ప్రాజెక్టుల్లో ఒకటి. అలాంటి ప్రాజెక్టకన్నా మూడురెట్లు పెద్దది బ్రహ్మపుత్ర నదిపై నిర్మించబోయే జలవిద్యుత్ ప్రాజెక్టు. తొందరలో నిర్మించబోయే జల విద్యుత్ ప్రాజెక్టు సామర్ధ్యం 60 గీగావాట్ల విద్యుత్ ఉత్పతట.

ఒకవేళ చైనా గనుక నిజంగానే ప్రాజెక్టు కట్టేస్తే మనదేశానికి ఇబ్బందులు తప్పవు. ఎలాగంటే బ్రహ్మపుత్ర నదిలోని నీటిలో అత్యధికం జల విద్యుత్ ఉత్పత్తికే సరిపోతుంది. 2900 కిలోమీటర్ల పొడువున్న నదీ ప్రవాహం టిబెట్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం గుండా ప్రవహిస్తుంది. మనదేశంతో పాటు బంగ్లాదేశ్ దేశాల్లో జనాల నీటి అవసరాలను తీరుస్తోంది. పై వివరాలను చూసిన తర్వాత బ్రహ్మపుత్ర నది మనదేశానికి ఎంత అవసరమో అర్ధమైపోతుంది.

మనకు ఇంతటి కీలకమైన బ్రహ్మపుత్ర నదిలో నీటిని జల విద్యుత్ ఉత్పత్తికి వాడేయటానికి చైనా నిర్ణయిచింది. లేకపోతే నదికి భారీగా వరదలు వచ్చినపుడు ఒక్కసారిగా డ్యాం గేట్లు ఎత్తేస్తే నీటి ప్రవాహానికి మనదేశంలోని గ్రామాలకు గ్రామాలు కొట్టుకుని పోయినా ఆశ్చర్యంలేదు. అంటే మనదేశంలో చైనా ఏ విధంగా అయినా చిచ్చు పెట్టగలదు. అందుకనే చైనా అడుగులను మనదేశం చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. అయితే డ్యాం విషయాన్ని కానీ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణంపైన కానీ డ్రాగన్ అధికారికంగా కేంద్రానికి ఇంతవరకు ఏమీ చెప్పలేదు. మరి చెబితే మన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News