చైనా నీచ బుద్ది మ‌ళ్లీ బ‌య‌ట‌ప‌డింది

Update: 2017-03-17 17:29 GMT
ఇత‌రుల‌కు ఓ రూల్‌...త‌న‌కు మ‌రో రూల్‌. ఇదీ ఎప్ప‌టి నుంచో చైనా తీరు. తాజాగా మ‌రోసారి త‌న బుద్ధిని బ‌య‌ట‌పెట్టుకుంది. గ‌తేడాది అగ్ని 5 మిస్సైల్‌ ను ప‌రీక్షించినందుకు భారత్‌ పై మండిప‌డిన చైనా... తాను మాత్రం మ‌న బ‌ద్ధ శ‌త్రువు పాక్‌ తో క‌లిసి మిస్సైల్స్‌ ను త‌యారు చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. యాంటీ మిస్సైల్‌ - యాంటీ షిప్ మిస్సైల్స్‌ను త‌యారుచేయ‌నున్న‌ట్లు చైనా అధికార‌ ప‌త్రిక గ్లోబ‌ల్ టైమ్స్ ప‌త్రిక వెల్ల‌డించింది.

మ‌న పొరుగునే ఉండి ప‌క్కలో బ‌ల్లెంలాగా మారిన చైనా-పాకిస్తాన్‌ లు క‌లిసి తేలిక‌పాటి యుద్ధ విమానం ఎఫ్‌ సీ-1 జియావోలాంగ్‌ ను కూడా రూపొందించ‌నున్నాయి. ఉగ్ర‌వాద వ్య‌తిరేక చ‌ర్య‌ల‌ను క‌లిసి చేప‌ట్టాల‌ని కూడా నిర్ణ‌యించాయి. పాక్ ఆర్మీ చీఫ్ ఖ‌మ‌ర్ బ‌జ్వా - చైనా సీనియ‌ర్ ఆర్మీ అధికారి మ‌ధ్య తాజాగా జ‌రిగిన చ‌ర్చ‌ల్లో ఈ కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు గ్లోబ‌ల్ టైమ్స్ తెలిపింది. సంయుక్తంగా మిస్సైల్స్ త‌యారీకి స‌హ‌కరించినందుకుగాను చైనా - పాక్ ఎక‌న‌మిక్ కారిడార్‌ కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డానికి పాక్ అంగీక‌రించింది. ఈ కారిడార్ భ‌ద్ర‌త కోసం పాకిస్థాన్ 15 వేల‌కు పైగా బ‌ల‌గాల‌ను మోహ‌రించ‌గా.. గ్వాడ‌ర్ పోర్ట్ ర‌క్ష‌ణ కోసం నేవీ ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంది. పాక్‌కు తాలిబ‌న్‌ - అల్‌ ఖైదా నుంచి ముప్పు పొంచి ఉండ‌టంతో చైనా మిలిట‌రీ స‌హ‌కారం త‌మ‌కు అవ‌స‌రమ‌ని పాకిస్థాన్ భావిస్తున్న‌ది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News