ట్రంప్ ఓ క‌మెడియ‌న్ అంటున్న చైనా

Update: 2017-01-12 17:45 GMT
అమెరికా కాబోయే అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పై చైనా భారీ సెటైర్లు పేల్చింది. #అది చేస్తా.. ఇది చేస్తా అని ట్రంప్ ఇప్పుడు ఎన్ని చెబుతున్నా.. అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టిన త‌ర్వాత ఏమీ చేయ‌లేరు. కేవ‌లం ట్విట్ట‌ర్‌కే త‌న ఎజెండా ప‌రిమిత‌మ‌వుతుంది# అంటూ చైనా ట్రంప్ దూకుడును జోక్ ఖాతాలోకి చేర్చింది. ప్ర‌స్తుతం త‌న ట్విట్ట‌ర్ సామ్రాజ్యంలో వ్య‌క్తిగ‌త ఎజెండా గురించి ట్రంప్‌ చెబుతున్నప్ప‌టికీ ...వైట్‌హౌజ్‌లోకి వెళ్లిన త‌ర్వాత అది కుద‌ర‌ద‌ని, త‌న ఎజెండాను ముందుకు తీసుకెళ్ల‌డానికి ఎన్నో అడ్డంకులు ఆయ‌న‌కు ఉంటాయ‌ని చైనీస్ మీడియా స్ప‌ష్టంచేసింది.

చైనాకు చెందిన ప్ర‌ముఖ ప‌త్రిక‌ గ్లోబ‌ల్ టైమ్స్ త‌న ఎడిటోరియ‌ల్‌లో ఈ మేర‌కు ట్రంప్ భ‌విష్య‌త్ ప‌నితీరును విశ్లేషించింది. ట్రంప్‌ ప‌ద‌విలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎన్నో సంక్లిష్ట అంశాలు ఉంటాయ‌ని, ఒబామా వ‌దిలేసిన ప‌నులు కూడా చేయాల్సి ఉంటుంద‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌న వ్య‌క్తి ఎజెండాను అమ‌లు చేయ‌డం సాధ్యం కాద‌ని తేల్చేసింది. కాగా...అధ్య‌క్షుడిగా ఎన్నికైన త‌ర్వాత తొలి ప్రెస్‌మీట్‌లో నాలుగు అంశాల‌పై ఆరుసార్లు చైనా గురించి ట్రంప్ ప్ర‌స్తావించారు. అలీబాబా వ్య‌వ‌స్థాప‌కుడు జాక్ మా గురించి మాత్ర‌మే ఆయ‌న పాజిటివ్‌గా మాట్లాడారు. చైనాతో వాణిజ్య లోటు కార‌ణంగా ప్ర‌తి ఏడాది అమెరికా వంద‌ల కోట్ల డాల‌ర్ల న‌ష్టాన్ని చ‌విచూస్తోంద‌ని ట్రంప్ అన్నారు. తాను వ‌చ్చిన త‌ర్వాత గ‌తంలో ఎప్పుడూ లేనంత‌గా చైనా అమెరికాను గౌర‌విస్తుంద‌ని చెప్పారు. అయితే దీనిని గ్లోబ‌ల్ టైమ్స్ ప‌త్రిక తిప్పికొట్టింది. అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టి వైట్‌హౌజ్‌లోకి వెళ్లాక త‌న ముందు అనే స‌వాళ్లు ఉన్నాయ‌ని తొలి ప్రెస్ మీట్‌లోనే ట్రంప్‌కు తెలిసింది అని గ్లోబ‌ల్ టైమ్స్ అభిప్రాయ‌పడింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News