ఉత్త‌ర కొరియా ఉరిమితే చైనా వణికిపోతోంది

Update: 2017-04-15 14:12 GMT
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం క‌ల‌క‌లం రేకెత్తిస్తున్న దేశాధినేత‌లు ఇద్ద‌రే. ఒక‌రు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కాగా, మ‌రొక‌రు ఉత్త‌ర కొరియా ర‌థ‌సార‌థి కిమ్ జోంగ్‌. త‌న దేశంపై జ‌రిగే క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు కిమ్ జోంగ్ మామూలు రిప్లై ఇవ్వ‌ట్లేదు. అవ‌స‌ర‌మైతే అణ్వ‌స్త్ర దాడి చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించేస్తూ కిమ్ ప్ర‌త్య‌ర్థి దేశాల‌ వెన్నులో వ‌ణుకుపుట్టిస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ ఆంక్షలు - ఆందోళనలను బేఖాతరు చేస్తూ ఉత్తరకొరియా దూకుడుగా అణ్వాయుధ ప్రయోగాలను చేపట్టింది. ఆ దేశ వ్య‌వ‌స్థాప‌కుడు కిమ్ సంగ్ 105వ జ‌యంతి సంద‌ర్భంగా నార్త్ కొరియా ఈ మిలిట‌రీ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించింది. ఎవ‌రు త‌మ‌ను రెచ్చ‌గొట్టినా, వారిపై అణుదాడి చేస్తామ‌ని ఉత్త‌ర కొరియా త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ స‌మ‌క్షంలో ఆయుధ ప్ర‌ద‌ర్శ‌న జ‌రిపింది.

దీనిపై క‌ల‌వ‌ర‌పాటుకు గురైన చైనా త‌న‌తో భావ‌సారుప్య‌త క‌లిగిన ర‌ష్యా స‌న్నిహిత్యాన్ని కోరింది. ఉద్రిక్తతలు సడలించేందుకు సాయం చేయాలని  చైనా విదేశాంగమంత్రి రష్యా విదేశాంగ మంత్రిని కోరారు. ర‌ష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌ తో చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యి భేటీ అయ్యారు. కొరియా విషయంలో అన్ని పక్షాలను చర్చలకు ఆహ్వానించి ఉద్రిక్తతలను తగ్గుముఖం పట్టించడమే ఇరుదేశాల ధ్యేయమని చైనా ప్రకటించింది. ఈ విషయంలో రష్యా సాయాన్ని చైనా కోరినట్టు ఆ దేశ విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

మ‌రోవైపు తమ ప్రాదేశిక జలాల్లోకి అమెరికా నావికాదళం చొచ్చుకురావడంపై ఉత్తర కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాతో యుద్ధానికి సిద్ధమని హెచ్చరించింది. ఉత్తరకొరియా అణు కార్యక్రమాలను నిలిపివేయించేందుకు ఒత్తిడి పెంచే క్రమంలో భాగంగా అమెరికా నావికాదళాలు ఆ దేశ ప్రాదేశిక జలాల్లోకి వచ్చాయి. ఈ చర్యలు ఉత్తరకొరియాను ఆక్రమించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు తీవ్రస్థాయికి చేరాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఏ తరహా యుద్ధనైనా ఎదుర్కోవడానికి ఉత్తరకొరియా సిద్ధంగా ఉంద‌ని ఉత్తరకొరియా విదేశాంగశాఖ మంత్రిని ఉటంకిస్తూ ఆ దేశ జాతీయ మీడియా తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News