డ్రాగన్ దమ్మును తక్కువగా అంచనా వేసే వారికి షాకిచ్చేలా చేయటమే కాదు.. ప్రపంచంలో కొత్త ఉద్రిక్తతలకు తెర తీసేలా తన ఆయుధ బలాన్ని ప్రదర్శనకు పెట్టింది. కమ్యూనిస్ట్ పార్టీ 70వ వార్షికోత్సవం సందర్భంగా తాజాగా బయటపెట్టిన క్షిపణి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే డ్రాగన్ బయటపెట్టిన క్షిపణి అగ్రరాజ్యమైన అమెరికాను కేవలం అరగంటలో దూసుకెళ్లగలదు. అంతేకాదు.. అమెరికా రక్షణ వ్యవస్థలకు అందకుండా లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదించే శక్తి ఈ క్షిపణి సొంతం.
అమెరికాను సైతం అరగంటలో టార్గెట్ చేసే అత్యాధునిక క్షిపణిని తొలిసారి ప్రదర్శించటం ద్వారా చైనా తన బలమేమిటో ప్రపంచానికి అర్థమయ్యేలా చేసింది. ఈ సరికొత్త క్షిపణిని తియన్మాన్ స్క్వేర్ వద్ద బారులు తీశారు. ఇప్పటివరకూ చైనా వద్ద 11,200 కిలోమీటర్లు ప్రయాణించే డాంగ్ ఫెంగ్ క్షిపణి మాత్రమే ఉంది.
దీనికి మించిన క్షిపణిని తాను తయారు చేసిన వైనాన్ని తాజా ప్రదర్శన ద్వారా అందరికి అర్థమయ్యేలా చేసింది. అంతేకాదు.. దీని శక్తిసామర్థ్యాల్ని వెల్లడిస్తూ.. ఇది శబ్ద వేగానికి దాదాపు 25 రెట్ల వేగంతో ప్రయాణించగలిగే సత్తా ఉండటమే కాదు.. ఒకేసారి 10 వార్ హెడ్లను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. లక్ష్యాన్ని ఛేధించే ఈ క్షిపణి ప్రదర్శనతో అగ్రరాజ్యం అమెరికా సైతం ఉలిక్కిపడేలా చేసిందని చెప్పాలి.
దక్షిణ చైనా సముద్రంలో జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో చైనా తన ఆయుధాల్ని ప్రదర్శించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ క్షిపణి ప్రపంచంలోనే అత్యం శక్తివంతమైనదిగా అమెరికా వార్తా సంస్థ సీఎన్ ఎన్ చెబుతోంది. మరోవైపు.. చైనాకు చెందిన మీడియా సంస్థ ఒకటి ఈ క్షిపణిని ఏడో తరం క్షిపణిగా పేర్కొంది. ఈ బల ప్రదర్శనతో తానెంత శక్తివంతమైనదన్న విషయాన్ని చైనా స్పష్టం చేసిందని చెప్పక తప్పదు. మరీ.. బలప్రదర్శనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.