గ్రేటర్ ఎన్నికల్లో మాసత్తా చూపిస్తాం.. మా తడాఖా చాటుతాం అంటూ... ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా సవాళ్లు చేయవచ్చు. ఎవ్వరూ కాదనలేరు. అయితే.. గ్రేటర్ పరిధిలోని వారు... కనీసం తెలంగాణ రాష్ట్ర పరిధిలోని సదరు పార్టీ నాయకులు అలాటి సవాళ్లు విసిరితే అందులో ఔచిత్యం ఉంటుంది. అలా కాకుండా అదే పార్టీ అయినంత మాత్రాన పొరుగు రాష్ట్రానికి చెందిన నాయకులు 'కాచుకోండి మేం సత్తా చాటేస్తాం' అంటూ సవాళ్లు విసిరితే అది కాస్తా కామెడీగా అనిపిస్తుంది. ఇప్పుడు పరిస్థితి అలాగే ఉన్నది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చూపిస్తుందని.. తమ బలాన్ని నిరూపించుకుంటుందని.. తెలంగాణలో తెదేపా చాలా బలంగా ఉన్నదనే విషయం రుజువు అవుతుందని ఆ పార్టీ కి చెందిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సెలవిస్తున్నారు. అదికూడా కనీసం హైదరాబాదులో కూడా అనడం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్టణంలో మాట్లాడుతూ హోంమంత్రి చినరాజప్ప ఈమేరకు తెలంగాణలోని ఇతర పార్టీల వారికి సవాళ్లు విసరడం విశేషం.
చంద్రబాబును... తెలంగాణ మంత్రి మరియు మాజీ తెదేపా నాయకుడు మహేందర్‌రెడ్డి విమర్శించిన నేపథ్యంలో ఆయనకు ప్రతిగా విరుచుకుపడిన హోంమంత్రి చినరాజప్ప.. చంద్రబాబును తిట్టే అర్హత మహేందర్‌రెడ్డికి లేదని తేల్చేస్తున్నారు. హైదరాబాదు మాది అంటూ సెలవిచ్చారు. తెలంగాణ మాది.. అక్కడ టీడీపీ బలంగా ఉంది అంటున్నారు.
కావొచ్చు గాక.. కానీ.. ఆ సవాళ్లు విసరడానికి తమ పార్టీలోని తెలంగాణ నాయకులు ఎవ్వరూ సిద్ధంగా లేరా? అనేది సామాన్యులకు కలుగుతున్న సందేహం. ఇలా తెలంగాణలోని ఒక నగర కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపోటముల గురించి పొరుగు రాష్ట్రానికి చెందిన నాయకులు సవాళ్లు విసురుతూ ఉంటే.. ఆ పార్టీకి ఉన్న పరువు కూడా గంగలో కలుస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.