చైనా వారి బుద్ది ఈ జన్మలో మారదంతే ..ఏమైందంటే !

Update: 2020-05-13 12:10 GMT
పాములు - తేళ్లు - కుక్కలు - పిల్లులు - బొద్దింక‌లు - గ‌బ్బిలాలు - క‌ప్ప‌లు..ఇలా అసలు ఏ మాత్రం తేడా లేకుండా ఏ జంతువైనా - ఏ కీట‌క‌మైనా ఏ జీవి అయినా చైనీయుల‌కు తేడా ఉండ‌దు. కంటికి కనిపించగానే ..నోట్లో వేస్తే ఎంత బాగుంటుందో కదా అని అనుకుంటారు. అసలు ఈ ప్ర‌పంచంలో వీరు తినని జివి అంటూ ఏది లేదు ..అలాగే చైనా వారిలా ఏ జీవినైనా తినగలిగే మనుషులు మరే దేశంలో కూడా కనిపించరు.

ఆలా బ్రతికున్న జీవుల్ని తినే పిచ్చే వల్లే ఈ మహమ్మారి బయటకి రావడానికి కార‌ణ‌మైంద‌ని.. వుహాన్‌ లోని ప్ర‌పంచ అతి పెద్ద మాంసం మార్కెట్టే వైర‌స్ వ్యాప్తికి కేంద్రమైంద‌ని ఆరోప‌ణ‌లున్న సంగ‌తి తెలిసిందే. ఐతే క‌రోనా వ్యాప్తి పెరిగాక అక్క‌డ మార్కెట్‌ ను మూసేశారు.

వుహాన్ స‌హా కొన్ని న‌గ‌రాల్లో మాంసం విక్ర‌యాల్ని ఆపేశారు. కానీ అక్క‌డ లాక్ డౌన్ ఎత్తేశాక మ‌ళ్లీ మాంసం విక్ర‌యాలు పునఃప్రారంభం అయ్యాయి. ఎప్ప‌ట్లాగే జ‌నాలు అన్ని ర‌కాల మాంసాన్ని తినేస్తున్నారు. చైనాలోని ఓ చోట ఒక బండిలో బ‌తికున్న క‌ప్ప‌లు వంద‌ల సంఖ్య‌లో పోసి పెడితే - జ‌నాలు చుట్టూ చేరి క‌ప్ప‌ల్ని ఏరి క‌వ‌ర్ల‌లో వేసుకుంటున్న ఒక వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. క‌ప్ప‌ల్ని తిన‌డమేంటి అని మ‌న‌కు అస‌హ్యం పుట్టొచ్చు.

కానీ.. చైనీయులు మాత్రం బ‌తికున్న క‌ప్ప‌ల్ని అలాగే నూనెలోకి వేసి బ‌య‌టికి తీసి లాగించేస్తారు. మ‌నం లైవ్ ఫిష్ కోసం ఎలా ఆస‌క్తి చూపిస్తామో వాళ్లు లైవ్ క‌ప్ప‌లు అలా ఆసక్తి చూపిస్తారు. మ‌నం చేప‌నైనా - కోడినైనా చ‌ర్మం తీసి బాగా ఉడికించి మ‌సాలా ద‌ట్టించి కూర చేసుకుని తింటాం. కానీ చైనీయులు అలా కాదు.. ఏ జీవినైనా జ‌స్ట్ అలా వేడి నీళ్ల‌లో వేసి బ‌య‌టికి తీసి నోట్లో వేసుకుంటారు.


Full View
Tags:    

Similar News