ఉగ్రస్థావరాల్లో చైనా జెండాలు!

Update: 2016-10-19 04:20 GMT
పాక్‌ను అంతర్జాతీయంగా ఏకాకి చేసే ప్రయత్నాల్లో భారత్ నిమగ్నమైన వేళ... పాక్ గొప్ప త్యాగాలు చేసిందంటూ ఆ దేశానికి అండగా నిలిచే ప్రయత్నాలు చైనా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని ఏ ఒక్క దేశంతోనే - మతంతోనే ముడిపెట్టవద్దంటూ బ్రిక్స్ సదస్సులో సన్నాయి నొక్కులు నొక్కింది. ఇప్పటికే చాలా ప్రపంచ దేశాలు పాక్ కు ఉగ్రవాదానికి మధ్య ఉన్న అవినాభావ సంబందంపై భారత్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తుంటే.. పక్కనే ఉన్న చైనాకు మాత్రం అలా కనిపించడంలేదు! తమ శాశ్వత మిత్రుడిని అడ్డంగా వెనకేసుకొస్తోంది. ఆ మాటల సంగతి అలా ఉంటే తాజాగా జమ్మూకశ్మీర్‌ లోని ఉగ్రవాద స్థావరాల్లో తొలిసారిగా చైనా జాతీయ జెండాలు దర్శనమిచ్చాయి!

దీనివెనకున్న పూర్తి విషయాలు తెలియాల్సి ఉన్నా... బ్రిక్స్ సదస్సులో పాక్ అధికార ప్రతినిధిగా మాట్లాడిన చైనా ఈ స్థాయికి పనికి కూడా నిస్సిగ్గుగా వడిగట్టడానికి వెనకాడి ఉండకపోవచ్చనే విమర్శలూ వస్తున్నాయి. తాజాగా బారాముల్లా పట్టణంలో భారత భద్రతా బలగాలు జరిపిన సోదాల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ జెండాలను మన భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ సోదాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్న 44 మంది అనుమానితులను అరెస్ట్‌ చేయగా, వారి నుంచి పెట్రోల్‌ బాంబులు - చైనా - పాకిస్థాన్‌ జెండాలు - జైషే మహ్మద్‌ - లష్కరే తాయిబా సంస్థల లెటర్‌ ప్యాడ్లు - మొబైల్‌ ఫోన్లు - ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా... తాజా సోదాల్లో పట్టణంలో అనేక స్థావరాలు బయటపడ్డాయని, వాటిలో కొత్తగా చైనా జెండాలు కూడా దర్శనమిచ్చాయని ఆర్మీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News