ఆ దేశ అధ్యక్షుడికి ‘దంగల్’ నచ్చింది

Update: 2017-06-10 09:42 GMT
ఒక ఇండియన్ సినిమాను మరో దేశ అధ్యక్షడు చూడటం.. మన దేశ ప్రధానితో సమావేశం సందర్భంగా ఆ సినిమా ప్రస్తావన తేవడం.. ప్రశంసలు కురిపించడం అరుదైన విషయం. అమీర్ ఖాన్ సినిమా ‘దంగల్’ ఈ గౌరవాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం గురించి చైనా దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ గొప్పగా మాట్లాడారట. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం సందర్భంగా ఆయన భారతీయ సినిమాల ప్రస్తావన తీసుకొచ్చారట.

ఇండియన్ మూవీస్ బాగుంటాయని.. ఇటీవల తమ దేశంలో విడుదలై మంచి వసూళ్లు సాధించిన ‘దంగల్’ను తాను కూడా చూశానని.. తనకా సినిమా బాగా నచ్చిందని జిన్ పింగ్ చెప్పారట. ఈ విషయమై భారత విదేశాంగ కార్యదర్శి జై శంకర్ ఓ ప్రకటన కూడా చేయడం విశేషం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వార్షిక సమావేశంలో భాగంగా మోడీ.. జిన్ పింగ్ సమావేశమయ్యారు. అక్కడే ‘దంగల్ గురించి చర్చ జరిగింది.

ఐదు వారాల కిందట చైనాలో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ‘దంగల్’ అక్కడ సంచలన వసూళ్లు సాధించింది. ఇప్పటిదాకా ఏకంగా రూ.1100 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ముందు నెల రోజుల వరకే అనుకున్న ‘దంగల్’ స్క్రీనింగ్ ను మరో నెల రోజుల పాటు పొడిగించడం విశేషం. ఇప్పటికీ ఈ సినిమా అక్కడ ఏడు వేల థియేటర్లలో ఆడుతోంది. జులై 4 వరకు ‘దంగల్’ ప్రదర్శన కొనసాగనుంది. ఫుల్ రన్లో ఈ సినిమా చైనాలో రూ.1500 కోట్ల వరకు వసూలు చేసే అవకాశాలున్నాయి. ‘దంగల్’ ఓవరాల్ కలెక్షన్లు రూ.2 వేల కోట్లకు చేరువగా ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News