రూ.983కోట్లు; అంతరిక్ష నౌక కాదు.. ఆఫీసే

Update: 2015-05-24 09:13 GMT
చేతిలో డబ్బులున్న పెద్దమనిషి కాస్తంత కళాపోషణతో వ్యవహరిస్తే ఎలాంటి అద్భుతాలు రూపొందుతాయనటానికి తాజా ఆఫీసే నిదర్శనం. పై నుంచి చూస్తే అంతరిక్ష నౌకను తలపించేలా ఉన్న ఇది.. ఒక ఆఫీసు కార్యాలయం. చైనాలో ఒక డబ్బులున్న పెద్దమనిషి బుర్రలో ఒక ఐడియా ఫ్లాష్‌ అయ్యింది. అంతే.. తన సంస్థ హెడ్డాఫీసు అచ్చు అలానే ఉండాలని డిసైడ్‌ అయ్యాడు. ఖర్చు గురించి ఆలోచించవద్దన్నాడు.

ఇంకేం.. డబ్బులు కుమ్మరించటానికి పెద్దమనిషి రెఢీ కావాలే కానీ.. కొండ మీద నుంచి కోతిని దించటానికి చాలామంది రెఢీగా ఉంటారు కదా. అదే తీరులో పెద్దాయన ముచ్చటపడినట్లుగా అంతరిక్ష నౌకను తలపించేలా ఆఫీసును తయారు చేసేశారు. 2008లో స్టార్ట్‌ చేసిన ఈ భవనం ఏడాది కిందటే పూర్తి చేశారు.

ఆరేళ్ల పాటు నిర్మాణం సాగించిన ఈ ఆఫీసు బిల్డింగ్‌కు ఏకంగా రూ.983కోట్లు ఖర్చు చేశారు. రెండు ఫుట్‌బాల్‌ కోర్టులు ఉన్నంత స్థలంలో దీన్ని రూపొందించారు.  ఆన్‌లైన్‌ గేమ్స్‌.. మొబైల్‌ అప్లికేషన్స్‌ను రూపొదించటంలో పేరున్న నెట్‌ డ్రాగన్‌ వెబ్‌సాఫ్ట్‌ కంపెనీ అధినేత ల్యూ డిజియాన్‌ దీన్ని నిర్మాణం జరిపించారు. చైనాలోని ఫుజియాన్‌ రాష్ట్రంలో ఉన్న ఈ భవనంలో వసతులకు లోటు లేదని చెబుతున్నారు. రూ.983కోట్లు కూడా చిన్న మొత్తమేమీ కాదు కదా.


Tags:    

Similar News