ఢిల్లీ ప్లైట్ లో చైనీయుడి వాంతులు.. వణికిన ప్రయాణికులు

Update: 2020-02-08 07:50 GMT
కరోనా వైరస్ ఎంత దడ పుట్టిస్తుందనటానికి తాజా ఉదంతం పెద్ద ఉదాహరణగా చెప్పాలి. కరోనా వైరస్ తీవ్రత దేశంలో పెద్దగా లేనప్పటికీ.. చిన్న విషయాలకు సైతం ఉలిక్కిపడటం.. ఆందోళనకు గురి కావటం పెరుగుతోంది. ఢిల్లీ నుంచి ఫూణెకు వెళుతున్న ఎయిరిండియా విమానం లో చైనాకు చెందిన ఒక వ్యక్తి వాంతులు చేసుకోవటం తో విమానం లో ఉన్న విమాన సిబ్బంది తో పాటు.. ప్రయాణికులు సైతం హడలిపోయారు.

ఈ ఉదంతంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది సదరు చైనీయుడిని ఫూణె కు చేరుకున్న వెంటనే.. నేరుగా ఆసుపత్రి కి తరలించటమే కాదు.. అతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షలు జరుపుతున్నారు. అతడి బ్లడ్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మిగిలిన ప్రయాణికుల ఆందోళన అంతా ఇంతా అన్నట్లు లేదు. కరోనా వైరస్ గాలి ద్వారా.. స్పర్శ ద్వారా.. వేగంగా విస్తరించే గుణం ఉండటంతో.. విమానాన్ని ఖాళీ చేయించి.. విమానం మొత్తాన్ని మళ్లీ శుభ్రం చేయించారు. దీంతో.. సదరు విమానం ఆలస్యమైంది కూడా. చైనాలో లక్షలాది మంది కరోనా అనుమానితులు గా ఉంటే.. వేలాది మంది కరోనా బారిన పడి బాధ పడుతున్నారు. ఇప్పటికే 600పైగా మరణించారు. దేశంలో మాత్రం ఇప్పటి వరకూ మూడు కేసులు బయటకు రాగా.. ఆ మూడు కేరళ కు చెందిన వారే కావటం గమనార్హం.
Tags:    

Similar News