అమ‌రావ‌తికి నో చెప్పార‌ని ఎమ్మెల్యే గుడ్‌ బై

Update: 2015-10-20 15:49 GMT
అమరావతి శంఖుస్థాపనకు వెళ్లకూడదని నిర్ణయించిన ఏపీ కాంగ్రెస్‌కు ఆ నిర్ణ‌యం తీవ్రంగా బెడిసికొట్టింది. ఆ నిర్ణ‌యం వెలువ‌డిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నూజివీడుకు చెందిన చిన్నం రామకోటయ్య పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హ‌స్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు.

చిన్నం రామకోటయ్య 2014 వ‌ర‌కు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్ర విభజన జ‌రిగిన త‌ర్వాత కాంగ్రెస్‌ లో చేరి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోవడంతో 2014 త‌ర్వాత రాజ‌కీయాల్లో పెద్ద‌గా ఆక్టివ్‌ గా లేక‌పోయినా...పార్టీకి మాత్రం దూరం కాలేదు.

తాజాగా అమరావతి శంకుస్థాపనకు అన్ని పార్టీల నేతలు వస్తున్న నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్‌ పార్టీ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. తన నియోజకవర్గ ప్రజలందరి తరపున తాను శంకుస్థాపనకు వెళ్లాలని నిర్ణయించుకున్నాన‌ని...అందుకోసం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాన‌ని రామ‌కోట‌య్య ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల ప‌క్షాన ఉంటానే త‌ప్ప పార్టీ ఏ నిర్ణ‌యం తీసుకున్నా త‌లూపుతూ తాను సై కొట్ట‌లేన‌ని ఈ సంద‌ర్భంగా రామ‌కోట‌య్య స్ప‌ష్టం చేశారు. ఎమ్మెల్యే రాజీనామా చూసి అయినా కాంగ్రెస్ పెద్ద‌లు బుద్ధిమార్చుకుంటారో...వైసీపీ నేత‌లు క‌ళ్లు తెరుస్తారో చూడాలి మ‌రి.
Tags:    

Similar News