జగన్ ను చూసి ముచ్చట పడుతున్న చింతా!

Update: 2017-02-08 09:30 GMT
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ లీడర్ చింతా మోహన్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను విశ్లేషించారు. ఏపీలో సాగుతున్న రాజకీయ రన్నింగు రేసులో జగన్ ముందంజలో ఉన్నారని ఆయాన తేల్చారు. ప్రజాసమస్యలపై స్పందన, పోరాటంలో జగన్ ఫస్ట్ ప్లేసులో ఉండగా ఆయన్ను అందుకోవడానికి పవన్ ప్రయత్నిస్తున్నారని.. చంద్రబాబు మాత్రం ఆ ఇద్దరినీ అందుకోలేక అల్లాడుతున్నారని మోహన్ అన్నారు.  అంతేకాదు.. ప్రతిపక్ష నేత పాత్రను వైఎస్‌ జగన్  సమర్థవంతంగా పోషిస్తున్నారని ప్రశంసించారు.
    
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పిచ్చోళ్లు నడిపిస్తున్నారని చింతా విమర్శించారు. ఒక పిచ్చోడిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నామంటూ అమెరికా ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని… కానీ రెండేళ్ల క్రితం నుంచే ఇద్దరు పిచ్చోళ్లను ( మోడీ - చంద్రబాబు) ఎన్నుకున్నందుకు మన దేశ   రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని చింతమోహన్ వ్యాఖ్యానించారు.
    
ప్రజా సమస్యలపై జగన్ రాష్ట్రమంతా వాయు వేగంతో చుట్టేస్తున్నాడని, ఆయన్ను అందుకోవడానికి పవన్ కల్యాణ్ 77 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నారని అన్నారు.  కాంగ్రెస్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.  
    
కాంగ్రెస్ నేతలు ఒక్కరొక్కరుగా అధికార పార్టీ పంచన చేరుతున్న తరుణంలో చింతా మోహన్ మాత్రం వైసీపీ వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. జగన్ కష్టపడుతుండడం.. ఆయన సామర్థ్యంపై నమ్మకంతో ఆ పార్టీలో చేరే అవకాశాలున్నాయని తిరుపతిలో టాక్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News