వాజ్ పేయ్ వ‌డ్డించింది చెప్పిన చింతా

Update: 2017-06-09 05:55 GMT
ఏపీ రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత‌గా.. కేంద్ర‌మాజీ మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన చిత్తూరు జిల్లా నేత చింతా మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో బీఫ్ పై న‌డుస్తున్న ఇష్యూ నేప‌థ్యంలో.. బీజేపీ నేత‌లు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేలా ఆయ‌న వ్యాఖ్య‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. బీఫ్ ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న క‌మ‌ల‌నాథుల‌కు క‌రెంటు షాక్ కొట్టేలా చింతా వ్యాఖ్య‌లు ఉన్నాయి.

బీజేపీ అగ్ర‌నేత వాజ‌పేయే స్వ‌యంగా త‌న‌కు బీఫ్ను వ‌డ్డించిన‌ట్లుగా చింతా మోహ‌న్ చెప్పారు. త‌మ‌కు బీఫ్ ను వ‌డ్డించిన ఏడాదికే ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి అయిన విష‌యాన్ని గుర్తు చేశారు. స్వ‌తంత్ర భార‌త‌దేశంలో ఎవ‌రేం తినాలో.. ఎవ‌రేం తిన‌కూడ‌దో ఆంక్ష‌లు పెట్టే అధికారం ఎవ‌రికీ లేద‌న్నారు. బీఫ్ అమ్మ‌కాల‌పై నిషేధాన్ని ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌న్నారు.

తాజాగా మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసిన చింతా.. గ‌తంలో జ‌రిగిన ఒక ఆస‌క్తిక‌ర విష‌యాన్ని చెప్పుకొచ్చారు. 1997లొ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న వాజ‌పేయ్ త‌న‌తో పాటు బీఎస్పీ అధినేత కాన్షీరామ్‌ ను విందుకు ఆహ్వానించార‌న్నారు. ఆ రోజు త‌న ఇంట్లో ప‌శుమాంసంతో చేసిన వంట‌కాల్ని వ‌డ్డించార‌న్నారు. అంత‌టి ఉదార స్వ‌భావం క‌లిగిన నేత కావ‌టంతోనే అదే రోజు మాయావ‌తిని యూపీ సీఎంను చేశార‌ని.. ఆ త‌ర్వాత ఏడాదే వాజ్ పేయ్ ప్ర‌ధాన‌మంత్రి అయ్యార‌న్నారు. బీఫ్ ను బీజేపీ స‌సేమిరా అంటున్న వేళ‌.. ఆ పార్టీకి మార్గ‌ద‌ర్శ‌కుడిగా భావించే వాజ‌పేయ్ బీఫ్‌కు అనుకూలంగా ఉన్నారంటూ చింతా చెప్పిన మాట‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News