టీడీపీ సీనియర్ నాయకుడు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పట్ల పోలీసులు జులుం ప్రదర్శించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఆయనను బలవతంగా తోసుకుంటూ.. పిడిగిద్దులు గుద్దుతూ.. అరెస్టు చేశారని.. తెలిపారు.ఈ క్రమంలో చింతమనేని ధరించిన చొక్కాను కూడా చింపేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ నేతలు.. దేవినేని ఉమా మహేశ్వరరావు, వర్ల రామయ్య తదితరులు మీడియాకు విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఏపీ డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు.
చింతమననేని ఫైర్ బ్రాండ్ నాయకుడు అనే విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల కాలంలో ఆయన దూకుడు తగ్గించారు.అయిన కూడా పోలీసులు ఏదో ఒక రూపంలో కేసులు పెడుతూ.. వేధిస్తున్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. తాజాగా.. చింత మనేని పుట్టిన రోజును పురస్కరించుకుని దెందులూరు నియోజకవర్గంలో మంగళవారం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రక్తదానం, పేదలకు అన్నదానం, వస్త్రాల పంపిణీ వంటివాటికి చింతమనేని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
అయితే, రక్తదానం చేసేందుకు చేసిన ఏర్పాట్లను సోమవారం చింతమనేని పరిశీలించేందుకు వెళ్లగా.. ఆకస్మికంగా అక్కడకు చేరుకున్న పోలీసులు ఆయనపై జులుం ప్రదర్శించారని టీడీపీ నేతలు తెలిపారు. రక్తదానం కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, ఇతర ఏర్పాట్లనుకూడా పోలీసులు కూల్చేశారని.. ఈ క్రమంలో చింతమనేనిని అకారణంగా అరెస్టు చేశారని.. బలవతంగా ఆయనను తోసుకుంటూ.. పోలీసు వ్యాన్ ఎక్కించారని చొక్కా చిరిగిపోయిందని చెప్పినా.. పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు.
ఇదిలావుంటే.. పోలీసు స్టే షన్‌కు తరలించిన పోలీసులు.. అనంతరం.. సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఇదిలావుంటే, మంగళవారం ఏర్పాటు చేసిన రక్తదానం, అన్నదానం, వస్త్రాలపంపిణీ యధావిథిగా సాగుతుందని టీడీపీ నాయకులు చెప్పగా.. పోలీసులు మాత్రం ఎలాంటి అనుమతి లేదని.. ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వబోమని పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉంటుందని తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.