ఆర్థికంగా స్థితిమంతులు.. డబ్బున్నవాళ్లు.. గ్యాస్ సబ్సిడీని వదులు కోవాలని ఆ మధ్య ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చాడు. దీని వల్ల గ్యాస్ కంపెనీలపై.. ప్రభుత్వంపై భారం తగ్గించాలని ఆయన కోరాడు. గ్యాస్ సబ్సిడీ అనేది కేవలం పేద వాళ్లకు మాత్రమే అయితే బావుంటుంది. అందరూ దీన్ని వాడుకోవడం వల్ల ప్రభుత్వానికి భారం పెరుగుతోందని మోడీ వివరించారు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని.. స్థితిమంతులు అంతా గ్యాస్ సబ్సిడీ వదులకోవాలని ఆయన కోరాడు.
అయితే దానికి పెద్దగా స్పందన రాలేదని గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ విషయంపై జనస్పందన తక్కువేనని అవి గణాంకాలతో సహా చెబుతున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణ పరిధిలో పదివేల మంది , ఏపీ పరిధిలో ఆరు వేలమంది మాత్రమే గ్యాస్ సబ్సిడీని వదులకొన్నారని.. వీరి శాతం చాలా తక్కువ అని గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి. ఆర్థికంగా శక్తి మంతులు ఎంతోమంది ఉన్నప్పటికీ.. వాళ్లందరిలోనూ స్పందన లేదని.. వారు గ్యాస్ సబ్సిడీని వదులుకోవడానికి ముందుకు రాలేదని కంపెనీలు వివరించాయి.
ఇలాంటి నేపథ్యంలో ప్రధాని పిలుపుపై మరింత ప్రచారం కల్పించాలని గ్యాస్ కంపెనీలు భావిస్తున్నాయి. అందు కోసం కలిసి రావాలని మెగాస్టార్ చిరంజీవిని, ఆయన తనయుడు రామ్ చరణ్ ను కోరనున్నట్టుగా గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి. మరి కాంగ్రెస్ వాలా అయిన చిరంజీవి.. ఆయన తనయుడు రామ్ చరణ్ లు ప్రధాని పిలుపు మేరకు స్పందిస్తారేమో చూడాలి!