రెడ్ శాండిల్ మాఫియా క్వీన్ సంగీతా ఛటర్జీని కోల్ కతాలో చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకొని.. చిత్తూరు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సంగీతను కోర్టులో హాజరు పర్చాలన్న ఆదేశంతో పలుమార్లు విఫలయత్నం చేసిన చిత్తూరు పోలీసులు..పట్టువదలని విక్రమార్కుల మాదిరి వ్యవహరించి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు టాలీవుడ్ సినిమాల్లో కనిపించే సన్నివేశాన్నిరియల్ గా రిపీట్ చేయాల్సి వచ్చింది.
తన ఆచూకీ బయటకు రాకుండా.. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న సంగీతను పట్టుకోవటానికి పోలీసులు చాలానే కసరత్తు చేయాల్సి వచ్చింది. ఆ మధ్యన పోలీసుల చేతికి చిక్కినా.. తనకున్న పలుకుబడితో యాభై మంది లాయర్లను దించి మరీ.. చిత్తూరు పోలీసుల కస్టడీ నుంచి బయటకు వచ్చేసిన ఆమె.. అప్పటివరకూ దొరికింది లేదు.
సంగీతను ఎట్టి పరిస్థితుల్లోనూ అదుపులోకి తీసుకోవాలన్న లక్ష్యంతో ఉన్న చిత్తూరు పోలీసులు ఈసారి భారీ స్కెచ్ గీశారు. గతంలో ఆమెను అదుపులోకి తీసుకోవటానికి చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిన నేపథ్యంలో.. ఈసారి పక్కా ప్లాన్ తో వ్యవహరించారు. నేరస్తుడు సహజంగా చేసే తప్పుల్ని అవకాశంగా మలుచుకోవాలన్న ప్రాధమికసూత్రాన్ని ఫాలో అయి.. సక్సెస్ ఫుల్ గా సంగీతను అదుపులోకి తీసుకున్నారు.
సంగీతను పట్టుకోవటానికి పోలీసులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. ఆమె భర్త లక్ష్మణ్ చాలానే సూచనలు చేసినట్లుగా చెబుతున్నారు. అట్టే బయటకు రావొద్దని.. పబ్ లు.. పార్టీలు లాంటి వాటికి అస్సలు వెళ్లొద్దని..తరచూ ప్లేసులు మార్చాలంటూ చెప్పినప్పటినీ.. వాటిని నిర్లక్ష్యం చేయటమే పోలీసులకు చిక్కేలా చేసిందన్న మాట వినిపిస్తోంది.
సంగీతను అదుపులోకి తీసుకోవటానికి పక్కా ప్లానింగ్ చేసిన చిత్తూరు పోలీసులు.. ఈసారి ఒక డీఎస్పీ..ఒక సీఐ.. ఒక మహిళా ఎస్ ఐ తో పాటు మరో ముగ్గురు సిబ్బంది కోల్ కతాకు వెళ్లారు. ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆమె దొరకలేదు. అయితే.. సోమవారం సాయంత్రం ఆమె రూబ్ సెల్లార్ లోని పబ్ లో ఉన్నట్లు సమాచారం అందించింది. వెంటనే.. పోలీసులు మూడు జంటలుగామారిపోయి పబ్ కి వెళ్లారు. అక్కడ సంగీత కనిపించింది. తాము చూసింది సంగీతేనా? కాదా? అన్నది కన్ఫర్మ్ చేసుకోవటానికి డ్యాన్స్ చేస్తున్నట్లుగా నటించి.. ఆమెకు దగ్గరగా వెళ్లి.. ఆమేనని నిర్దారించుకున్నారు. అయితే.. అప్పటికే రాత్రి 2.30గంటలు కావటం తో..ఆమె కదలికలపై కన్నేవారు. పబ్ నుంచి ఆమెను ఫాలోఅయ్యారు.
ఆమె ఉన్న సీఎన్ రాయ్ రోడ్డులోని పీజీ హాస్టల్ ను గుర్తించారు.దగ్గరల్లోనే పోలీసులు సైతం రూమ్ ను రెంట్ కు తీసుకొని.. టైం కోసం వెయిట్ చేయసాగారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించి.. మంగళవారం ఉదయం 10 గంటల వేళలో మందుల షాపుకు వెళ్లేందుకు హాస్టల్ బయటకురావటం.. వెంటనే పోలీసులు ఆమెను చుట్టుముట్టేశారు. ఈ సందర్భంగా కళ్లు తిరుగుతున్నట్లుగా వాంతులు అవుతున్నట్లుగా.. మరెన్నో చిన్నెలు ప్రదర్శించినా.. పోలీసులు ఆమె నాటకాల్ని పారనీయలేదు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా..దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లటం.. ఆపై ఆమెను అదుపులోకి తీసుకొని.. న్యాయపరమైన అంశాల్ని క్లియర్ చేసుకొని..చిత్తూరుకు బయలుదేరారు. గడిచిన ఏడాదిగా చిత్తూరు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న సంగీత.. ఎట్టకేలకు దొరికేసింది. ఈ ఎపిసోడ్ మొత్తం యాక్షన్ సినిమాల్లోని సన్నివేశంలా ఉండటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/