చిత్తూరు కలెక్టర్ సంచలనం.. ఆ మాత్రం చేయాలి బాస్.. మిగిలినోళ్లు ఫాలో కావాల్సిందే
ఐఏఎస్ అధికారులంతా ఎస్ బాస్ అన్నట్లుగా మారారని..రోజులు గడుస్తున్న కొద్దీ వెన్నుముక లేకుండా పోతుందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటి విమర్శలు ఎలా ఉన్నా.. కొందరు అధికారులు మాత్రం రూల్ బుక్ ప్రకారం పోవటమే కాదు.. తేడాగా వ్యవహరించే వారికి చుక్కలు చూపించేస్తుంటారు. తాజాగా అలాంటి పనే చేసి సంచలనంగా మారారు చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్. విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాల్సిన స్థానే.. అలాంటి ఊసే లేకుండా వ్యవహరిస్తున్న అధికారులకు భిన్నంగా ఆయన తీసుకున్న తాజా నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ ఆయనేం చేశారంటే.. జిల్లాలోని ఐదు మండలాలకు చెందిన ఉద్యోగుల జీతాల్ని నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల జీతాలు ఆపేశారా? అంతలా ఎందుకు చేశారు? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే.. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభినందించకుండా ఉండలేం. ఇంతకూ జరిగిందేమంటే.. ఆరో విడత ఫీవర్ సర్వేలో తవణంపల్లె.. శ్రీకాళహస్తి.. సత్యవేడు.. మదనపల్లె మండలాల్లోని రెవెన్యూ.. పంచాయితీ రాజ్.. హెల్త్.. సచివాలయం.. మున్సిపల్ శాఖ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
దీంతో.. ఆయన ఉద్యోగులకు దిమ్మ తిరిగే షాకిచ్చారు. విపత్తు నిర్వహణ చట్టం కింద బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారుల జీతాల్ని ఆపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉదంతం షాకింగ్ గా మారింది. ప్రభుత్వ ఉద్యోగులం.. మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి ఇలాంటి షాకులు ఇవ్వాల్సిందే. చిత్తూరు జిల్లా కలెక్టర్ బాటలో మిగిలిన వారు పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.