తమిళుల్ని తీవ్ర విషాదంలో ముంచెత్తిన అమ్మ మరణం నుంచి అక్కడి ప్రజలు కోలుకోక ముందే.. తమిళప్రజలు విపరీతంగా అభిమానించే రాజకీయ విశ్లేషకుడు.. తన మాటలతో నేతల్లో చురుకు పుట్టించిన విమర్శకుడు చో రామస్వామి మరణించారు. 82 ఏళ్ల చో రామస్వామి అస్వస్థతతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అమ్మకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న చో రామస్వామి.. జయ మరణించిన ఒక రోజు వ్యవధిలోనే కన్నుమూయటం.. అది కూడా ఆమె మరణించిన చెన్నై అపోలో ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడవటం గమనార్హం. జయలలితతో కలిసి అనేక నాటకాల్లో.. సినిమాల్లో నటించిన ఆయన తుగ్లక్ నాటకం ద్వారా దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు.
చో రామస్వామి తెలుగు వారికి కూడా బాగా పరిచయస్తులు. ఆయన.. ప్రముఖ నటి రమ్యకృష్ణకు మేనమామ. తుగ్లక్ పత్రికతో రాజకీయ నేతలకు అక్షరాలతో చురుకు పుట్టించటమే కాదు..వారి ఆగ్రహానికి గురైనా.. వెనక్కి తగ్గని ధీరత్వం ఆయన సొంతంగా చెబుతారు. 1999 – 2005 మధ్య రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన ఆయనకు దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరిగా ప్రముఖులు దూరం కావటం తమిళుల్ని వేదనకు గురి చేస్తుందనటంలో సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/