సిక్సర్లు కొడతాడు.. సెక్సుకు పిలుస్తాడు

Update: 2016-01-06 11:22 GMT
కళ్లు చెదిరే సిక్సర్లతో మతి పోగొట్టే వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడు క్రిస్ గేల్ సిక్సర్లే కాదు సెక్స్ విషయంలోనూ అంతే దూకుడుగా ఉంటాడని అంటుంటారు. అమ్మాయిల విషయంలో గేల్ చాలా స్పీడని చెబుతారు. ఐపీఎల్ మ్యాచ్ లు అయిపోయిన తరువాత గేల్ ను ఆపలేమని అంటుంటారు. తాజాగా గేల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. గేల్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ ఆస్ట్రేలియా మహిళ ఆరోపించింది. 2015 వరల్డ్‌ కప్‌ సమయంలో వెస్టిండిస్‌ జట్టుతో కలిసి పనిచేస్తున్న తన పట్ల గేల్ చాలా అభ్యంతరకరంగా వ్యవహరించాడని ఆమె చెప్పింది.
    
శాండ్‌ విచ్‌ తీసుకొనేందుకు ఆమె  టీమ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ కు వెళ్లారట... అక్కడ టవల్  మాత్రమే కట్టుకొని ఉన్న గేల్ వెంటనే టవల్‌ కూడా తీసేసి సెక్సుకు ఇన్ వైట్ చేశాడట. దాంతో ఆమె షాక్ తిందట. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేసి వెస్టిండిస్ జట్టు మేనేజర్ - మాజీ కెప్టెన్ రిచీ రిచర్డ్‌ సన్‌ కు  వివరించగా.. మహిళా సిబ్బందితో ఆటగాళ్లు గౌరవప్రదంగా వ్యవహరించాలంటూ సర్క్యులర్ జారీచేశారని, కానీ అందులో గేల్ పేరు ప్రస్తావించలేదని ఆమె ఆరోపించింది.  
    
కాగా గేల్ పై మరో ఆరోపణా దుమారం సృష్టిస్తోంది. టీవీ ప్రజెంటర్ అయిన మెల్‌ మెక్‌ లాలిన్‌ ను 'మందేద్దాం వస్తావా" అంటూ గేల్‌ ప్రత్యక్ష ప్రసారంలో అడగడం తీవ్ర దుమారం సృష్టిస్తోంది. అయితే..  ఆ తరువాత క్రిస్ గేల్‌ ఆమెను క్షమాపణలు కోరడంతో ఆమె కూడా సరిపెట్టుకుంది.
Tags:    

Similar News