సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్ కు రంగం సిద్ధమైపోయిన వేళ... ఎక్కడ ఏ చిన్న విషయం బయటకు వచ్చినా... దానిపై వైరి వర్గాలు చిలువలు పలువలు చేసేస్తున్నాయి. పట్టుబడ్డ అభ్యర్థిని బదనాం చేయడమే లక్ష్యంగా వైరి వర్గాలు తమదైన శైలిలో విరుచుకుపడుతున్నాయి. ఇలాంటి ఘటనే ఇప్పుడు తెలంగాణలో చోటుచేసుకుంది. ఈ ఘటనలోని వాస్తవాలను పక్కనపెట్టేసి... నిజంగానే చిలువలను పలువలు చేసిన వైనం చాలా స్పష్టంగానే కనిపిస్తోందని చెప్పక తప్పదు.
ఇక అసలు విషయంలోకి వెళితే... మొన్నటిదాకా టీఆర్ ఎస్ లోనే ఉండి - గడచిన ఎన్నికల్లో అదే పార్టీ టికెట్ పైనే ఎంపీగా విజయం సాధించి సరిగ్గా ఎన్నికలకు కాస్తంత ముందుగా గులాబీ దళానికి షాకిచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్త - చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయన చేవెళ్ల నుంచే మరోమారు బరిలోకి దిగారు. తమ పార్టీకి షాకిచ్చిన కొండాను ఈ సారి ఎలాగైనా ఓడించి తీరాలని టీఆర్ ఎస్ దాదాపుగా కంకణం కట్టుకుందనే చెప్పాలి. అయితే టీఆర్ ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా... చేవెళ్లలో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేయడంతో పాటుగా ప్రచారంలో కొండా దూసుకెళుతున్నారనే చెప్పాలి. పోలింగ్ రేపు అనగా... బుధవారం కొండాకు సంబంధించిన ఓవ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి వద్ద కొంత నగదును పట్టుకున్నారు.
ఈ విషయం తెలిసిన వెంటనే టీఆర్ ఎస్ రంగంలోకి దిగిపోయి... దొరికిన సొమ్ము రూ.10 కోట్లు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసేసింది. దీంతో ఈ వార్త ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే అసలు వాస్తవం ఇదేనంటూ కొండా నేరుగానే మీడియా ముందుకు వచ్చారు. తన అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న మాట వాస్తవమేనని ఒప్పుకున్న కొండా... అతడి వద్ద దొరికింది రూ.10 కోట్లు కాదని - కేవలం రూ.10 లక్షలేనని వివరణ ఇచ్చారు. రూ.10 లక్షలు దొరికతే... దానిని రూ.10 కోట్లుగా చెబుతూ దుష్ప్రచారం చేస్తున్న టీఆర్ ఎస్ తనను ఇబ్బంది పెట్టేందుకు యత్నించిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఈ విషయంపై తాను ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని - టీఆర్ ఎస్ ఎన్ని కుట్రలు చేసినా... ఈ సారి కూడా చేవెళ్లలో గెలిచేది తానేనని కొండా దీమా వ్యక్తం చేశారు.