టీఆర్ ఎస్ లో మంత్రి - మాజీ మంత్రి - మరో కృష్ణుడు

Update: 2020-06-18 16:30 GMT
టీఆర్ఎస్ లో ఇప్పుడు తాజా మంత్రికి, మాజీ మంత్రికి అస్సలు పడటం లేదట.. టీఆర్ఎస్ లో ఉన్న ఈ ఇద్దరూ ఉప్పు నిప్పూలా ఒకే గొడుగు కింద ఫైటింగ్ చేసుకుంటున్నారు.

ఓరుగల్లు రాజకీయాల్లో తలపడిన నేత రెడ్యానాయక్. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా చేశారు. తొలి తెలంగాణ ప్రభుత్వంలోనూ మంత్రి అయ్యాడు. తరువాత రెండో హయాంలో ఆయన రాజకీయ ప్రత్యర్థి సత్యవతి రాథోడ్ ను టీఆర్ఎస్ హైకమాండ్ మంత్రిని చేసింది. టీడీపీలో సత్యవతి ఉంటే.. కాంగ్రెస్ లో రెడ్యానాయక్ ఉండి ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోయేవారు. ఇద్దరికీ ఒక్కక్షణం కూడా పడదు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ లో ఒకే ఒరలో రెండు కత్తులను ఇమిడ్చింది.

ఇప్పుడు అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు మంత్రి సత్యవతి మధ్య క్యాడర్ నలిగిపోతోంది. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో అడుగుపెట్టవద్దని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అధికారులు, క్యాడర్ కు, మంత్రికి హుకూం జారీ చేశారట.. రెడ్యానాయక్ తీరుతో షాకైన మంత్రికి మహబూబాబాద్ ఎంపీ , రెడ్యానాయక్ కూతురు మాలోతు కవిత నచ్చచెప్పారు. రెడ్యానాయక్ మాత్రం కూతురు మాటను పెడచెవిన పెడుతున్నాడట..

ఇప్పుడు రెడ్యానాయక్ వరంగల్ కే చెందిన మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో సాన్నిహిత్యం పెంచుకొని మంత్రి సత్యవతిపై పగసాధిస్తున్నాడట.. ఇద్దరూ కలిసి మంత్రి సత్యవతిని టార్గెట్ చేశారట..

ఇప్పుడు ఎవ్వరూ బయటపడకుండా వరంగల్ లో మంత్రి సత్యవతి వర్సెస్ రెడ్యానాయక్ ఎపిసోడ్ కోల్డ్ వార్ ను తలపిస్తోందట.. అధిష్టానం దీనిపై నజర్ పెట్టాలని కార్యకర్తలు సూచిస్తున్నారు.
Tags:    

Similar News