ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ బలంగా ఉందని చెప్పుకునే జిల్లాల్లో ప్రకాశం ఒకటి. పరిస్థితులకు సంబంధం లేకుండా అక్కడ వైసీపీ ప్రబలంగా ఉంటుంది. స్థానిక పరిస్థితులు, వైఎస్, జగన్ పై ఉన్న అభిమానం ఏదైనా కానీ ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా.. ఆధిపత్యం ఆ పార్టీదే అని చెప్పొచ్చు. 2014లో వైసీపీ అధికారంలోకి రాలేకపోయినా.. ప్రకాశం జిల్లాలో మాత్రం మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. నాటి ఎన్నికల్లో 12 సీట్లకు గాను వైసీపీ ఆరు నెగ్గగా, టీడీపీ ఐదుచోట్ల విజయం సాధించింది. మరో సీటులో నవోదయం పార్టీ అభ్యర్థి ఆమంచి క్రిష్ణమోహన్ గెలుపొందారు. చివరకు ఆయన సైతం వైసీపీలోకే వచ్చారు. అంటే.. మొత్తం ఏడు స్థానాలు వైసీపీవే అన్నట్టు. దీన్నిబట్టే ప్రకాశం జిల్లాలో వైసీపీ సత్తా ఏమిటో చెప్పొచ్చు. ఇక 2019 ఎన్నికల్లోనూ ప్రకాశం జిల్లాలో వైసీపీ 8 సీట్లు గెలుచుకుంది. టీడీపీ 4కు పరిమితమైంది. తర్వాత వీరిలో ఒక ఎమ్మెల్యే వైసీపీకి జై కొట్టారు. ప్రస్తుతం ఆ పార్టీకి ప్రకాశం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల బలం 9గా పేర్కొనవచ్చు. ఇదంతా సంఖ్యా పరంగా చెప్పుకొనే మాట. అయితే, వీరిలో ఎవరిపైనా పార్టీ సాటిస్పాక్షన్ తో లేదని స్పష్టమవుతోంది. అటు ప్రజల్లోనూ ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతుండడం చర్చకు వస్తోంది. అ కేవలం అధికారం ఉందని నాయకులు వెళ్తున్నారు తప్ప.. ఇతరత్రా ఆసక్తి ఏమీ లేదని అంటున్నారు.
ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో కష్టమే
బంధుత్వాల రీత్యా గానీ, ఇతర ప్రాధామ్యాల రీత్యా గానీ సీఎం జగన్ ఎక్కువ ఆసక్తి చూపే జిల్లాల్లో ప్రకాశం ఒకటి. అలాంటిచోట పార్టీ ఎమ్మెల్యేల తీరు చర్చనీయాంశం అవుతుంది అనడంలో సందేహం లేదు. గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీని ఆదరించిన జిల్లాగా ప్రకాశంకు మంచి పేరుంది. కానీ, ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో పార్టీకి గడ్డుకాలమే అని నివేదికలు వెళ్తున్నాయి.
పనితీరు పట్టని అధిష్ఠానం
కార్యకర్తల పరంగా జిల్లాలో పార్టీ బలంగా ఉన్నా.. ప్రజల్లోనూ అభిమానం చెక్కచెదరకున్నా.. ఎమ్మెల్యేల తీరుతో పార్టీ ఆదరణ తగ్గుతోంది. ఇటీవల పలు ఉదాహరణలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. పార్టీ పరంగా పిలుపునిచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేయలేకపోవడం, మొక్కుబడిగా పాల్గొనడం వంటి అంశాలను దీనికి సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. అయితే, దీనిపై అధిష్ఠానమూ పట్టనట్టు ఉంటుండడమే మరింత ఆందోళనకర అంశం. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ‘‘మున్ముందు కష్టమేనంటూ’’అనే పరోక్షంగా సంకేతాలు అందుకే వినిపిస్తున్నాయి.
మరీ ఇంత మొక్కుబడిగానా?
వైసీపీ అధికారంలోకి రావడానికి, అన్నింటికి మించి అతి భారీ మెజార్టీ రావడానికి ప్రధాన కారణం ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర. ఆ పాదయాత్రకు ఈ నెల 6వ తేదీతో నాలుగేళ్లు పూర్తయ్యాయి. దీన్ని పురస్కరించుకుని.. తన అనుభవాన్ని పేర్కొంటూ ఏపీ సీఎం జగన్ ట్వీట్ కూడా చేశారు.
కాగా, ఇదే సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని వైసీపీ పార్టీ వర్గాలకు పిలుపునిచ్చింది. అయితే, ఈ కార్యక్రమం జరిగిన తీరు అధిష్ఠానాన్ని ఆలోచనలో పడేసిందని చెబుతున్నారు. కేవలం అరగంట, గంట సమయం వెచ్చించి మీడియాకు కనిపించి వెళ్లిపోవడం, ముఖ్యంగా ఎమ్మెల్యేలు పెద్దగా శ్రద్ధ చూపకపోవడం వారి పరిశీలనకు వచ్చింది. మరోవైపు ఈ కార్యక్రమం విషయమై అన్నిచోట్లా ఇదే తీరు ఉందని, ఎమ్మెల్యేలు ఉత్సాహంగా పాల్గొన్నచోట కార్యక్రమం విజయవంతమైందని చెప్పకొంటున్నారు.
సీఎం టూర్ లో స్పష్టమైన ఆగ్రహం
ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలపై వైసీపీ ఏ స్థాయిలో అసంత్రప్తిగా ఉందో ఇటీవల సీఎం జగన్ పర్యటనలో స్పష్టమైంది. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అందిన నివేదికలతో ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం జగన్ ఆసరా కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చారు. ఆ సమయంలో కొందరు ఎమ్మెల్యేలతో ఆయన ముభావంగా ఉన్నారు. వాళ్ల పట్ల పెద్దగా స్పందన కూడా చూపలేదని సమాచారం.
నియోజకవర్గాల్లో హాట్ టాపిక్..
ఎందుకింత నిరాసక్తత?
సీఎం టూర్ అనంతరం తెలిసిన దాన్ని బట్టి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ఇప్పడు హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. ‘‘మా ఎమ్మెల్యేకు సీఎం సార్ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదట’’ అంటూ అన్ని నియోజకవర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, దీనివెనుక కారణాలూ లేకపోలేదు. ‘‘అధికారంలో ఉన్నాం.. ప్రజలే మన దగ్గరకు రావాలి’’ అని తీరులో ఎమ్మెల్యేలు ఉంటే, ప్రభుత్వం వచ్చినా ‘‘మనంకే ఒరిగింది’’ ‘‘మనం ఎందుకు ప్రజలను తరలించాలి’’అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పార్టీ , ప్రభుత్వ కార్యక్రమాలు రెంటికీ చెడిన రేవడిలా అవుతున్నాయి.