ఆ రాష్ట్ర సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్స్, విద్యార్థులకు క్రికెట్ కిట్లను ఉచితంగా ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. రాష్ట్రంలోని హైస్కూల్, కాలేజీ విద్యార్థులందరికీ ఈ సౌకర్యం కల్పించాడు. ఆయన నిర్ణయంపై విద్యార్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పంజాబ్ రాష్ట్ర సీఎం తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలోని హైస్కూల్, కాలేజీ విద్యార్థినులందరికీ ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇస్తామని సీఎం అమరీందర్ సింగ్ సంచలన ప్రకటన చేశారు.
ఇక విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా 2500 క్రికెట్ కిట్స్ ను అందజేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి కాలేజీ, స్కూలుకు ఒకటి చొప్పున వీటిని కేటాయించారు. తద్వారా విద్యార్థులు క్రీడల్లోనూ రాణిస్తారని ఈ ఏర్పాటు చేశారు.
ఇక రాష్ట్రంలోని వినియోగదారులపై కూడా వరాల వాన కురిపించాడు సీఎం అమరీందర్. వినియోగదారులు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక పోర్టల్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాడు.