కేసీఆర్ చెప్పిన అరుదైన పరిస్థితి రిపీట్ కానుందా?

Update: 2020-04-08 03:00 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించే ప్రెస్ మీట్లలో లాభం ఏమిటంటే.. రానున్న రోజుల్లో ఏమేం జరుగుతాయన్న విషయాలపై కాస్తంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అంతేకాదు.. ప్రజల మనసుల్లోని సందేహాలకు సమాధానంగా కొన్ని సమాధానాలు ఉంటాయి. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది విద్యార్థులు త్రిశంక స్వర్గం లో ఉన్నారని చెప్పాలి. చరిత్ర లో మరెప్పుడూ లేని రీతిలో చోటు చేసుకున్న కరోనా ఎపిసోడ్ కారణంగా.. విద్యార్థులకు బోలెడన్ని కొత్త సెలవులు యాడ్ అయ్యాయి.

కనుచూపు మేరలో వారి సెలవులు పూర్తయ్యే పరిస్థితి కనిపించటం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలోని పలు రాష్ట్రాల్లో విద్యార్థులకు నిర్వహించాల్సిన వార్షిక పరీక్షలు పూర్తి కాలేదు. పది లోపు తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోట్ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. కానీ.. పదో తరగతి విద్యార్థుల పరిస్థితి ఏమిటన్నది అసలు క్వశ్చన్.

తెలంగాణలో కొన్ని పరీక్షలు జరిగితే.. ఏపీలో అసలు మొదలు కాలేదు. ఇప్పట్లో స్కూళ్లు తెరిచే ఛాన్సు లేని నేపథ్యంలో వారి పరీక్షలు ఎప్పడు జరుగుతాయన్నది పెద్ద ప్రశ్నగా మారటమే కాదు.. లక్షలాది మంది విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు పెను టెన్షన్ లో ఉన్నారు. తాజాగా వచ్చిన సెలవులతో చదువు సాగకపోవటం.. ట్రాక్ తప్పటం జరిగి పోయినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షల్ని నిర్వహిస్తే ఇబ్బందే అంటున్నారు.

ఇలాంటి వేళ.. కొన్నిసార్లు చరిత్రలో సిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయంటూ ఆసక్తికర ముచ్చటను చెప్పుకొచ్చారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమైన సమయంలో పరీక్షలు నిర్వహించకుండా ఆల్ పాస్ అంటూ డిక్లేర్ చేశారని.. దాంతో అప్పటికే పలుమార్లు టెన్త్ పాస్ కాని వారు సైతం పాస్ అయిపోయారని చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు అలా జరుగుతుందంటూ చెప్పిన ఆయన మాటలకు తగ్గట్లే.. ఈసారి జరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు. అదే జరిగితే చరిత్రలో 2020 టెన్త్ పాస్ అవుట్ కు కొత్త గుర్తింపు రావటం ఖాయమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News