తెలంగాణలో అన్ని వ్యవస్థలన్నీ గాడీన పెట్టే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. గతంలో భూ రికార్డులు - రెవెన్యూ దస్త్రాలు పాత వాటిలో కొత్తవి తెచ్చి సంచలనం సృష్టించారు. ఇటీవల రోడ్డు రవాణా సంస్థను పట్టాలపైకి ఎక్కించారు. విజయ డైరీ - విజయ నూనెలు తదితర సంస్థలు నిలదొక్కుకునేలా సహాయం చేశారు. విద్యుత్ - ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఉదారంగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు రెవెన్యూ శాఖపై ఫోకస్ పెట్టనున్నారు. ఎప్పటినుంచో తనకు చికాకు తెప్పిస్తున్న ఈ శాఖపై ఎప్పుడో ప్రక్షాళన చేద్దామని భావించారు. ఈ రెవెన్యూ సమస్యలతో రైతులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పుణ్యానే ఒక తహసీల్దార్ తన కార్యాలయంలోనే పాశవిక హత్యకు గురైన సంఘటనను అందరూ చూసిందే కదా. అంతకుముందు ఓ రైతు ఆవేదనతో పంపిన వీడియోను కేసీఆర్ నేరుగా చూసి అతడి రెవెన్యూపరమైన సమస్యను పరిష్కరించారు. అప్పుడే ఆయన రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని మంకుపట్టు పట్టారు. ఇప్పుడు ఎన్నికలన్నీ ముగియడంతో కేసీఆర్ రెవెన్యూ శాఖ ప్రధాన దృష్టి పెట్టనున్నారు.
సీఎం కేసీఆర్ తీసుకునే రెవెన్యూ నిర్ణయాలతో డబుల్ రిజిస్ట్రేషన్లు ఆగిపోనున్నాయి.. ల‌్యాండ్ మ‌్యుటేషన్ పేరుతో దండుకునే కొందరు రెవెన్యూ అధికారుల ఆటలు ఇక సాగవు.. భూముల కొనుగోళ్లు - విక్రయాలపై కొత్త విధానం తదితర ఉంటాయని ప్రచారం సాగుతోంది. మొత్తానికి రెవెన్యూ శాఖలో అవినీతికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రెవెన్యూ శాఖలో దశాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతిని నిర్మూలించడమే లక్ష్యంగా సర్కార్ అడుగులు వేస్తుంది. భూ లావాదేవీలలో అధికారులు, రియల్ వ్యాపారులు కలిసి చేసే అవినీతికి చెక్ పెట్టేందుకు పకడ్బందీగా ముందుకెళ్తోంది ప్రభుత్వం.
వీరి అధికారాలకు కత్తెర
ల్యాండ్ మ్యుటేషన్ పై ప్రభుత్వం పెద్ద కసరత్తే చేస్తోంది. తమ పేరుపై రిజస్ట్రర్ అయి ఉన్న భూములను రెవన్యూ రికార్డులలో నమోదు చేసే ప్రక్రియే మ్యుటేషన్. ఈ మ్యుటేషన్లను అడ్డుపెట్టుకున్న కొందరు రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మ్యుటేషన్ల కోసం లంచం తీసుకుంటూ.. ఎక్కడో చోట ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. దీంతో పకడ్బందీగా కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందిస్తున్నారు. మొదట తహసీల్దార్ - వీఆర్వో అధికారాలకు కోత పెట్టనున్నారు. మ్యుటేషన్ లో ఉండే విచక్షణ అధికారాన్ని కొత్త చట్టంలో తొలగించే అవకాశం ఉంది.
మొత్తం ఆన్ లైన్ లో
భూ లావాదేవీల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నారు. దీంతో రెవెన్యూ వ్యవహారాలు ఆన్ లైన్ లో చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. తహసీల్దార్ - వీఆర్వోలకు సంబంధం లేకుండా ల్యాండ్ మ్యుటేషన్ ఆన్ లైన్ లో జరిగిపోతుంది. ఈ ప్రత్యేక సాఫ్ట్ వేర్ తో భూముల క్రయవిక్రయాల సమాచారం.. ఎప్పటికప్పుడు ల్యాండ్ డేటా బ్యాంక్ లకు అందుతుంది. అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ సమాచారం వెంటనే డేటా బ్యాంక్ కు వెళ్లిపోతుందన్నమాట. దీంతో తమకు అందిన డాక్యుమెంట్ ను సరిచూసుకుని రెవెన్యూ అధికారులు.. నిర్ణీత వ్యవధిలో మ్యుటేషన్ చేసేలా చట్టంలో ఉండబోతోంది. దీంతో ఏ రోజుకారోజు భూ వివరాలు క్షణాల్లో తెలుసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది.
కొత్త సాఫ్ట్ వేర్
ఇలా భూములను రిజస్ట్రేషన్ చేయగానే.. ఆ సమాచారాన్ని రెవెన్యూ శాఖతో పాటు - బ్యాంక్ లకు కూడా ఆ ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా చేరిపోతుంది. దీంతో డబుల్ రిజిస్ట్రేషన్ లకు బ్రేకులు పడతాయి. ఒకే భూమిని వివిధ బ్యాంక్ లలో తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం కూడా ఇక నుంచి సాధ్యం కాదు. మొత్తానికి రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన అవినీతిని పెకిలించివేయడానికి సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. టెక్నాలజీ వినియోగంతో కొత్త రెవెన్యూ విధానం తీసుకొచ్చి సులభతర కార్యకలాపాలు జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.