కేసీఆర్ కంట క‌న్నీరు వ‌చ్చిన సంద‌ర్బం ఇది

Update: 2017-04-29 16:58 GMT
తెలంగాణ‌కు చెందిన నీటిపారుద‌ల రంగ నిపుణుడు,  రాష్ట్ర నీటిపారుదలశాఖ సలహాదారు ఆర్‌.విద్యాసాగ‌ర్ రావు మ‌ర‌ణం ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను క‌లచివేసింది. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యం నుంచి ఉన్న స‌న్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ కేసీఆర్ కంట‌త‌డి పెట్టుకున్నారు. హబ్సిగూడలో ఉన్న విద్యాసాగర్‌ రావు నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్... పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా విద్యాసాగర్‌ రావు పార్థీవదేహాన్ని చూసి సీఎం కేసీఆర్ ఉద్వేగానికి గురై కంటతడి పెట్టారు. మంచి మిత్రుడు, పెద్దన్నలా వ్యవహరించిన వ్యక్తి, నీటిపారుదల రంగంలో నిపుణుడిని కోల్పోయామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

నీటిరంగ నిపుణుడు ఆర్ విద్యాసాగర్‌ రావు మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు. రాష్ట్రం ఒక గొప్ప మేధావిని, తెలంగాణవాదిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన ఉద్యమంలో విద్యాసాగర్‌రావు కృషి మరవలేనిదన్నారు. నీటి దోపిడీ గురించి తెలంగాణ ప్రజలకు సవివరంగా చెప్పిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్‌రావు అని కేటీఆర్‌ తెలిపారు. కాగా, సీఎం సతీమణి శోభ, ఎంపీ కవిత, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఉప సభాపతి పద్మాదేవేందర్‌ రెడ్డి, ఎంపీ వినోద్ నివాళులర్పించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News