పోలవరంలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన తెలంగాణ.. ఇప్పుడేం జరుగుతుంది?
సాఫీగా సాగే ప్రయాణంలో కుదుపులు మొదలవుతే.. ఏదో ఒక అడ్డంకి మొదలవుతూనే ఉంటుంది. అందునా ఒక రాష్ట్రానికి మేలు కలిగించే ఒక ప్రాజెక్టు.. దాని చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల ప్రయోజనాల్ని దెబ్బ తీస్తాయన్న ఆరోపణ.. విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. రాష్ట్రం ఏదైనా కానీ.. అక్కడి ప్రభుత్వం చేపట్టే ఇరిగేషన్ ప్రాజెక్టు మీద దాని చుట్టుపక్కల రాష్ట్రాల అభ్యంతరాలు భారీగానే కనిపిస్తాయి. ఇందుకు పోలవరం ప్రాజెక్టు మినహాయింపు కాదు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచితే.. ముంపు గ్రామాలు భారీగా పెరుగుతాయని..అది తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా చేస్తుందన్న వాదన మొదట్నించి ఉన్నదే. అంతేకాదు.. గోదావరి జిలాల్ని భారీగా వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నపోలవరం ప్రాజెక్టుపై ఏపీ సర్కారు తీరుకు తెలంగాణ ప్రభుత్వానికి చాలానే అభ్యంతరాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు మీద తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే తన వాదనల్ని వినిపించింది. అయితే.. కేంద్రం నుంచి స్పందన లేకపోవటంతో కామ్ అయ్యింది.అప్పుడప్పుడు ఈ అంశాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తావిస్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే.. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై కేంద్రం కొర్రీ పెట్టటం.. దీనిపై చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. కేంద్రం తీరు పోలవరం ప్రాజెక్టును మరింత ఆలస్యం చేయటమే కాదు.. ఏపీని ఏం చేస్తుందన్న అంశంపై బోలెడన్ని సందేహాలు ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో టైం చూసుకొని మరీ ఎంట్రీ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం. పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణ ప్రాంతంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయని.. వాటికి సంబంధించిన అధ్యయనం మరోసారి చేయాలని కోరుతోంది.
ప్రాజెక్టు కారణంగా తెలంగాణలో ఏర్పడు ముంపు విషయంలో మరోసారి అధ్యయనం చేసి... ప్రాణనష్టం.. ఆస్తినష్టం లేకుండా చూడాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని కోరనున్నారు. ఇందుకుసంబంధించిన లేఖను రాశారు కూడా. పోలవరం నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదంటూనే.. తెలంగాణ ప్రయోజనాల్ని పరిరక్షించుకోవటం తమ ఉద్దేశంగా పేర్కొన్నారు. కేంద్రం కొర్రీలు పెట్టేందుకు అవకాశం కోసం చూస్తున్న వేళ.. కేసీఆర్ సర్కారు నుంచి వెళ్లిన లేఖ.. ఏపీ ప్రయోజనాలకు అంతో ఇంతో ప్రభావితం చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.